Prabhas: ప్రభాస్ ఆధార్ కార్డ్ ఎప్పుడైనా చూశారా? ఇందులోని మిస్టేక్ ఏంటో చెప్పండి చూద్దాం
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పేది ఏముంది. ప్రజంట్ ప్యాన్ ఇండియా లెవల్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆయనే. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ మార్కెట్ ఓ రేంజ్‌కి వెళ్లింది. ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాలతో ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన లైనప్ ఉంది.

తెలుగు తెరపై తిరుగులేని రారాజు ప్రభాస్. నటుడిగా తోపు మాత్రమే కాదు.. వ్యక్తిగానూ ఆయన మనసు అమోఘం. సాటి మనుషులను గౌరవించే విధానం.. కష్టాల్లో ఉన్నప్పుడు ఆసరాగా నిలబడటం.. విపత్తులు సంభవించినప్పుడు భారీ ఆర్థికసాయం ప్రకటించడం వంటి గుణాలు ప్రభాస్‌కు వారసత్వంగా వచ్చాయి. అక్టోబర్ 23, 1979లో పుట్టిన ప్రభాస్.. గురువారంతో 46వ పడిలోకి అడుగుపెట్టారు. ఒకరకంగా తెలుగునాట నెగిటివిటీ లేని హీరో ప్రభాస్. తన సొంత ప్యాన్ బేస్‌తో పాటు అందరు హీరోల అభిమానులు ఆయన్ను అభిమానిస్తూ ఉంటారు. కలిసి పనిచేసిన టెక్నిషియన్స్‌ను, నటీనటుల్ని.. ఏ ఆర్టిస్ట్‌ను అడిగినా.. ప్రభాస్ కల్మషం లేని వ్యక్తి అని చెబుతారు. ఇక గురువారం ప్రభాస్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా అంతా షేకయిపోయింది. ప్రభాస్‌కు విషెస్ చెప్పడంతో పాటు ఆయన అరుదైన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగానే ప్రభాస్ ఆధార్ కార్డు సైతం కంటపడింది.
అయితే ఈ ఆధార్ కార్డులో చిన్న తప్పిదం ఉంది. అది ఏంటంటే… ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్య నారాయణ ప్రభాస్ రాజు.. అయితే ఆధార్ కార్డ్‌లో మాత్రం రాజు అని మాత్రం లేదు. 5986 6623 9932 నంబర్‌తో ప్రభాస్ ఆధార్ కార్డు ఉంది. అయితే కొందరు ఇది ఎడిటెడ్ కార్డు అని చెబుతున్నారు.
కాగా ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాజాసాబ్ విడుదలకు సన్నద్దమవుతుంది. ఇందులో వింటేజ్ లుక్‌లో సందడి చేస్తున్నాడు రెబల్ స్టార్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ లైనప్‌లో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




