Ameesha Patel: పిల్లలంటే ఇష్టం.. అందుకే దత్తత తీసుకున్నా.. విద్య వైద్య ఖర్చులన్నీ నావే అంటున్న హీరోయిన్
అమీషా పటేల్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. పవన్ కళ్యాణ్ తో బద్రి, మహేష్ బాబుతో నాని సినిమాల్లో నటించి తెలుగువారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. యాభైలో పడిన అమీష పటేల్ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు. అయితే తాను అమ్మే అని.. కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకున్నానని వెల్లడించింది. తను పెళ్లి పిల్లల గురించి ఎన్నో కలలు కన్నాను.. చాలా మంది పిల్లల్ని కనాలని.. తన పిల్లలు క్రికెట్ జట్టు ఏర్పాటు చేయాలనుకునే దానిని అని చెప్పింది.

కహోనా ప్యార్ హై, గదర్, బద్రి, నాని వంటి అనేక సినిమాల్లో నటించిన అమీషా పటేల్ వయసు 50 సంవత్సరాలు. నేటికీ ఆమె వివాహం చేసుకోలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యులో కొంతమంది పిల్లలను దత్తత తీసుకున్నానని, వారి విద్యకు నిధులు సమకూరుస్తున్నానని వెల్లడించింది. అంతేకాదు అమీషా పటేల్ పిల్లల పట్ల తనకున్న ప్రేమను వివరించింది. ఆమె మాట్లాడుతూ.. “నేను నా మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, బంధువుల పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసేదానిని. డైపర్లు మార్చేదానిని.. వారికి ఆహారం తినిపించి నిద్రపుచ్చేదానిని అని చెప్పింది.
తాను చాలా మంది పిల్లలని కనాలని కల కనేదానిని.. ఎవరికైనా.. మొత్తం క్రికెట్ జట్టుకు జన్మనిస్తానని చెప్పేదానిని తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తన తల్లి ఒక బిడ్డను కను.. తర్వాత చూద్దాం’ అని చెప్పేది.. ఎందుకంటే పిల్లలను కనడం, తల్లి కావడం చాలా కష్టం. నాకు పిల్లలంటే గొప్ప ప్రే.. వారిని చాలా ప్రేమిస్తున్నానని చెప్పింది.
అనాథలను దత్తత.. విద్య, వైద్యం
అదే సమయంలో నేను ఎప్పుడూ అనాథల గురించి ఆలోచించేదానిని. వారికి ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో నేను అనుకునే దానిని. అందుకనే నేను ఎవరికీ చెప్పకుండా కొంతమంది పిల్లలను దత్తత తీసుకున్నాను.. నేను వారిని దత్తత తీసుకున్నానని ఆ పిల్లలకు కూడా తెలియదు. నా దత్తత పిల్లల్ని చదివిస్తున్నాను. వారికి మెరుగైన జీవితాన్ని అందించడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాను. వారిని మంచి పౌరులుగా పెంచుతున్నాను.. తాను దత్తత తీసుకున్న పిల్లలకు వైద్యం లేదా విద్యాపరమై లోటు లేకుండా చుసుకుంటున్నట్లు వెల్లడించింది. పిల్లల్ని పెంచుకోవడం ఒక భాద్యత.. ఆ బాధ్యతకి భయపడి తాను కనీసం కుక్కని కూడా పెంచుకోవడం లేదని తెలిపింది.
పిల్లలు లేరు బ్యాగ్ లు ఉన్నాయి
నాకు పిల్లలు లేరు.. కానీ బ్యాగులున్నాయి. తనకు 16 సంవత్సరాల వయస్సు నుంచే బ్యాగులు సేకరించే అలవాటు ఉందని వెల్లడించింది. మా అమ్మ, అత్త, పిన్నిలు బ్యాగులు సేకరించడం చూసినప్పటి నుంచి నాకు బ్యాగులపై ప్రేమ పెరిగింది. అందుకనే బ్యాగ్స్ సేకరించడం మొదలుపెట్టానని వెల్లడించింది. అమీషా తన మొత్తం బ్యాగ్ కలెక్షన్‌ను ఫరా ఖాన్ వ్లాగ్‌లో ప్రదర్శించింది , ఆమె 300-400 బ్రాండెడ్ బ్యాగులు ఉన్నాయని చెప్పింది.
నన్ను పురుషుడిగా మార్చిన జీవితం నేను 5-6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటి నుంచే నా బ్యాగ్ లో ఎల్లప్పుడూ పెర్ఫ్యూమ్ బాటిల్ , దువ్వెన, బూట్లు ఉండేవి. నేను ఎల్లప్పుడూ అమ్మాయిగా ఉండడానికి ఇష్టపడేదానిని. అయితే పరిస్థితులు.. జీవితం తనని పురుషుడిగా ఆలోచించేలా మార్చేసిందని చెప్పింది అమీషా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








