AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahalaya Amavasya: మహాలయ అమావాస్య రోజున ఈ ఆరు ప్రదేశాల్లో దీపాలు వెలిగించండి.. అద్భుత ఫలితాలు మీ సొంతం..

భాద్రపద మాసం అమావాస్యతో పితృ పక్షం పూర్తి అవుతుంది. ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అని అంటారు. ఈ అమావస్యకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు దీపాలను వెలిగించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఇంట్లో ఈ ఆరు ప్రదేశాల్లో దీపాలను వెలిగించడం వలన పూర్వీకులు సంతోషించి దీర్ఘాయుష్షు, ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కలిగేలా దీవిస్తారు.

Mahalaya Amavasya: మహాలయ అమావాస్య రోజున ఈ ఆరు ప్రదేశాల్లో దీపాలు వెలిగించండి.. అద్భుత ఫలితాలు మీ సొంతం..
Mahalaya Amavasya
Surya Kala
|

Updated on: Sep 19, 2025 | 12:17 PM

Share

భాద్రప్రద మాసంలోని అమావాస్య తిథిని హిందూ మతంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేయడం వలన ఫలవంతం అని నమ్మకం. అందులో ఒకటి ఇంట్లో దీపాలను వెలిగించడం. ఇలా దీపాలను వెలిగించి మన పూర్వీకులను స్మరించుకోవడం వలన పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. కొన్ని ప్రదేశాలలో దీపాలు వెలిగించడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని, కుటుంబానికి శుభం కలుగుతుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున కొన్ని ప్రదేశాల్లో దీపాలు వెలిగించడం ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఆ ఆరు ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందాం..

పూర్వీకుల చిత్రం దగ్గర దీపం పూర్వీకుల చిత్రాల దగ్గర నువ్వుల నూనెతో లేదా నెయ్యి దీపం వెలిగించడం వారిని గౌరవించడానికి ఒక సులభమైన మార్గం. ఇది వారిని సంతృప్తిపరుస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదాలు ఇంటికి శాంతిని తెస్తాయి.

రావి చెట్టు కింద దీపం రావి చెట్టు త్రిముర్తులతో పాటు సకల దేవతలు, పూర్వీకుల నివాసంగా నమ్ముతారు. భాద్రప్రద అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభిస్తాయి. దురదృష్టం తొలగిపోతుంది. అదృష్టం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం ఇంటికి ప్రధాన ద్వారం ముఖ్యమైన ప్రదేశం. కనుక అమావాస్య రోజున ఇంటి ప్రధాన ద్వారం ఇరువైపులా దీపం వెలిగించడం చాలా ఫలవంతం. ఇలా చేయడం వలన ఆ ఇంటి నుంచి ప్రతికూలతను తొలగిస్తుంది.

దక్షిణ దిశలో నాలుగు వైపుల దీపం దక్షిణ దిశను యముడు దిశగా పరిగణిస్తారు. అమావాస్య రోజున దక్షిణ దిశలో నాలుగు వైపుల దీపాన్ని వెలిగించడం వల్ల పితృ శాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకుల ఆశీస్సులు కుటుంబంపై ఉంటాయని నమ్మకం.

నదీ తీరం వద్ద దీపాలు పురాణ గ్రంథాల ప్రకారం.. నీటిని జీవన్మరణాలకు మాధ్యమంగా పరిగణిస్తారు. అమావాస్య రోజున నదులు లేదా కాలవ ఒడ్డున దీపాలను వెలిగించడం ఫలవంతం. అంతేకాదు ఈ పరిహారం చేయడం వలన పూర్వీకుల ఆత్మకి శాంతి లభించి తమ వారసులకు ఆశీస్సులను ఇస్తుందని నమ్మకం.

పవిత్ర స్థలంలో దీపం మహాలయ అమావస్య రోజున పవిత్ర స్థలంలో, పూజా మందిరం దగ్గర దీపం వెలిగించడం వల్ల దేవుడి అనుగ్రహం లభిస్తుందని, పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు. మహాలయ అమావాస్య రోజున ఇలా దీపాలు వెలిగించడం వలన కుటుంబంపై పూర్వీకుల ఆశీస్సులు శాశ్వతంగా ఉంటాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..