AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గరుడ పురాణం ప్రకారం నేల మీద పడిన ఆహారం తినడం నిషిద్ధం.. ఈ నియమం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..

హిందూ మతంలో అన్నం పరభ్రహ్మ స్వరూపంగా పరిగణిస్తారు. అన్నపూర్ణ దేవి ఆహారానికి, పోషణకు ప్రతీకగా నిలుస్తుంది. ధాన్యాలను ఆమె స్వరూపంగా భావిస్తారు. అందుకే మన పురాణ గ్రంథాలు ఆహారాన్ని ప్రసాదంలా గౌరవించాలని భావిస్తాయి. అయితే ఆహారం తినే విషయంలో కొన్ని నియమాలున్నాయి. అందులో ఒకటి కింద పడిన ఆహారం మనుషులు తినకూడదు అనేది ఒకటి. ఈ ఆహారం అదృశ్య జీవులకు ఆహారంగా పరిగణించబడుతుందని గ్రంథాలు పేర్కొన్నాయి. గరుడ పురాణం ప్రకారం నేల మీద పడిన ఆహారం ఎందుకు తినకూడదో తెలుసుకుందాం..

గరుడ పురాణం ప్రకారం నేల మీద పడిన ఆహారం తినడం నిషిద్ధం.. ఈ నియమం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..
Garuda Puran
Surya Kala
|

Updated on: Sep 19, 2025 | 10:28 AM

Share

హిందూ మతంలో ఆహారాన్ని ప్రసాదం వలె పవిత్రంగా భావిస్తారు. మన పురాణ గ్రంథాలు అన్నం పరబ్రహ్మ అంటే ఆహారం బ్రహ్మ అని చెబుతున్నాయి. అన్నపూర్ణ దేవిని ఆహారానికి అధిష్టాన దేవతగా భావిస్తారు, కనుక ప్రతి ధాన్యం దైవత్వంతో ముడిపడి ఉంటుంది. ఆహారం ఎంత పవిత్రంగా ఉంటే.. దాని వినియోగానికి సంబంధించిన నియమాలు అంత కఠినంగా ఉంటాయి. నేల మీద పడిన ఆహారం మానవులు తినడం నిషిద్ధమని మత గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఎందుకంటే అది అదృశ్య జీవుల ఆహారం. ఈ విషయంలో గరుడ పురాణం ఏమి చెప్పిందంటే..

గరుడ పురాణలోని రహస్యం

గరుడ పురాణంలోని ప్రీత ఖండం ప్రకారం నేలపై పడిన ఆహారం వెంటనే అపవిత్రంగా మారుతుంది. నేల మీది పడిన ఆహారం ఇకపై దేవతలకు లేదా మానవులకు చెందదు. బదులుగా దయ్యాలు, పిశాచాలు , బ్రహ్మరాక్షసులకు ఆహారంగా మారుతుంది. అందువల్ల ఎవరైనా నేల మీద పడిన ఆహరాన్ని తీసుకుంటే.. వారిలోని ధర్మ నిరతి తగ్గిపోతుందని, జీవితంలో అడ్డంకులు పెరుగుతాయని చెబుతారు. మత గ్రంథాల ప్రకారం పడిన ఆహారాన్ని తినడం వల్ల ఒక వ్యక్తి మనస్సు కలవరపడుతుంది. ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది. అందుకే సాధువులు, ఋషులు ఇలాంటి ఆహరాన్ని బ్రహ్మరాక్షసుల ఆహారంలో భాగంగా పరిగణించి దానిని నివారించమని సలహా ఇస్తారు.

పడిన ఆహారాన్ని ఎందుకు తినకూడదు?

  1. స్వచ్ఛత నియమం: ప్రతి ఆహార గింజను దేవత స్వరూపంగా పరిగణిస్తారు. అందుకనే నేలమీద చిందిన ఆహారం అపవిత్రమవుతుంది. ఆ ఆహారం పూజకు పనికిరాదు. అతిథులకు వడ్డించకూడదు.
  2. కనిపించని జీవులకువాటా: నేల చిందిన ఆహారం కనిపించని జీవులకు నైవేద్యం అవుతుందని ఒక నమ్మకం. ఆ జీవులు దానిని తినడం ద్వారా సంతృప్తి చెందుతాయి.
  3. మతపరమైన హెచ్చరిక: పడిపోయిన ఆహారాన్ని తినే ఎవరైనా వారి అదృష్టానికి గ్రహణం పడుతుందని.. అనేక సమస్యలు ఎదుర్కొంటారని గరుడ పురాణం హెచ్చరిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని తినేవారి జీవితంలో అడ్డంకులు, మానసిక ఒత్తిడి , అపఖ్యాతి పెరగవచ్చు.
  4. ఆరోగ్యం, పరిశుభ్రత అంశం: నేల మీద పడిన ఆహారం దుమ్ము, సూక్ష్మక్రిములు, మలినాలతో మిళితమై ఉంటుంది. అందుకనే నేల మీద పడిన ఆహారం తినొద్దు అనే నమ్మకాన్ని సైన్స్ కూడా మద్దతు ఇస్తుంది.

ప్రజాదరణ పొందిన నమ్మకం, సంప్రదాయం

నేటికీ గ్రామాల్లో చిందిన ఆహారం బ్రహ్మరాక్షసులదేనని ఒక ప్రసిద్ధ నానుడి ఉంది. నేల మీద పడిన ఆహారం తింటే బ్రహ్మరాక్షసుల వల్ల ప్రభావితమవుతారని పెద్దలు నమ్ముతారు. ఈ భయం, దైవం మీద భక్తి కారణంగా, ప్రజలు ఇప్పటికీ నేల మీద పడిన ఆహారాన్ని జంతువులు, పక్షులు లేదా భూమి దేవికి అర్పిస్తారు. వాస్తవానికి ఈ సంప్రదాయం సామాజిక క్రమశిక్షణను బోధిస్తుంది. ఇది ఆహారాన్ని గౌరవించాలని, మనది కాని ఆహారాన్ని గౌరవంగా విస్మరించాలని నేర్పుతుంది. నేటికీ ఈ నియమం మత విశ్వాసాలకు ప్రతీకగా మాత్రమే కాదు ఆరోగ్యం, పరిశుభ్రతకు కూడా సంబంధించినది. వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా హానికరమైన బ్యాక్టీరియా, ధూళి కణాలు చిందిన ఆహారంలోకి చేరుకుంటాయని.. ఇలాంటి ఆహారం తినడం వలన కడుపు, పేగు వ్యాధులకు కారణమవుతుందని అంటున్నారు. అందువల్ల నేల మీద పడిన ఆహారాన్ని తినడం హానికరమని మతం, శాస్త్రం రెండూ అంగీకరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

గ్రంథాలు, ప్రజాదరణ పొందిన నమ్మకం, ఆధునిక శాస్త్రం అన్నీ నేల మీద పడిన ఆహారం మానవులు తినడానికి తగినది కాదని అంగీకరిస్తున్నాయి. దీనిని అదృశ్య జీవులలో ఒక భాగంగా పరిగణిస్తారు. ఈ నమ్మకాన్ని గౌరవించి జంతువులు, పక్షులకు ఈ ఆహారాన్ని అందించడం ఉత్తమ పరిష్కారంగా భావించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?