Vastu Tips: దంపతుల మధ్య వివాదలా..! ఆర్దిక ఇబ్బందులా.. కృష్ణ కమలం మొక్కని ఈ దిశలో పెంచండి..
కృష్ణ కమలం మొక్క భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పువ్వు శ్రీ కృష్ణుడు జీవితంలోని వివిధ అంశాలకు పోలి ఉంటుంది కనుక ఈ మొక్కకు కృష్ణ కమలం మొక్కనే పేరు వచ్చింది. ఇంటి పరిసరాల్లో ఈ మొక్కలను పెంచడం వలన దైవిక శక్తులను ఆకర్షిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కని పెంచుకోవడంలో కొన్ని నియమాలున్నాయి. ఏ దిశలో పెంచుకోవడం శుభ్రప్రదమో తెలుసుకుందాం.
Updated on: Sep 11, 2025 | 10:52 AM

కృష్ణ కమలం మొక్క ఊదా-నీలం రంగుతో అందంగా పుష్పించే ఒక లత. ఈ పువ్వులోని భాగాలు శ్రీకృష్ణుని జీవితంలోని వివిధ అంశాలతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. అందుకనే ఈ మొక్కని అత్యంత పవిత్రమైన మొక్క అని అంటారు. కృష్ణ కమల మొక్క వాస్తు ప్రాముఖ్యత, ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

ఈ పువ్వు 5 రేకులు.. 5 రక్షక పత్రాలు.. శ్రీకృష్ణుని, పాండవులకు చిహ్నంగా భావిస్తారు. అంతేకాదు కృష్ణ కమల పువ్వులోని మూడు కళంకాలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడని సూచిస్తాయి. పువ్వుల తంతువులు100 కౌరవులను సూచిస్తాయి. మొత్తం పువ్వు చుట్టూ ఉన్న తంతువులు శ్రీకృష్ణుని సుదర్శన చక్రాన్ని సూచిస్తుంది. ఈ మొక్కకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు అనేక ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంది , ఒత్తిడి ఉపశమనం కోసం ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది.

కృష్ణ కమలం నాటడానికి తూర్పు దిశ ఉత్తమ దిశగా పరిగణించబడుతుంది. ఇక్కడ దానిని నాటడం వల్ల సానుకూలత, ఆర్ధిక అభివృద్ధి పెరుగుదల, దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి.

ఈశాన్య దిశలో పెంచడం కూడా శుభప్రదం. ఈ దిశలో కృష్ణ కమలాన్ని ఉంచడం వలన ఆధ్యాత్మిక వృద్ధికి, మానసిక ప్రశాంతతకు మంచిది. ఆగ్నేయ మూలలో నాటడం శుభప్రదం. తద్వారా శ్రేయస్సు, శాంతి , సానుకూల శక్తి వస్తాయి.

కృష్ణ కమలం మొక్క ఒక తీగ. కనుక ఈ ప్రదేశాలలో ఈ మొక్కను పెంచడం వలన దీనికి మంచి మద్దతు కూడా లభిస్తుంది. అంతేకాదు ఈశాన్య దిశలో తోటలో ఈ మొక్క నాటడం ప్రకృతి , దైవిక శక్తులను సమన్వయం చేయడానికి ఇది అనువైనది. మంచి సూర్యకాంతి పొందుతుంది.

కృష్ణ కమలం మొక్కని పొరపాటున కూడా నైరుతి, దక్షిణం లేదా పశ్చిమ దిశలలో పెంచవద్దు. ఈ దిశలలో నాటడం అసమతుల్యత, స్తబ్దతకు కారణమవుతుంది.

కృష్ణ కమలం పువ్వులు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ప్రతికూలతను దూరం చేస్తాయి. గాలిని శుద్ధి చేస్తాయి. సామరస్య వాతావరణాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. మొక్క శాంతియుత శక్తి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కృష్ణ కమల మొక్క కుటుంబ సభ్యుల బంధాన్ని పెంపొందించడానికి, ముఖ్యంగా వివాహిత జంటల బంధాన్ని బలోపేతం చేస్తుంది. అంతేకాదు దీనిని సరైన దిశలో ఉంచినప్పుడు సంపద, ఆర్థిక సమృద్ధిని ఆహ్వానిస్తుంది. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి స్థిర నివాసం ఉంటుందని నమ్మకం.




