AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puranam: ఈ ఐదు అలవాట్లు ఉన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదట.. వెంటనే మార్చుకోండి

సనాతన ధర్మంలో 18 పురాణాలలో (పురాణాలు) గరుడ పురాణం అత్యంత ముఖ్యమైన పురాణం. గరుడ పురాణం అధినేత శ్రీ మహా విష్ణు. ఇందులో మనిషి జీవితంలో చేసే పనులు.. వాటి ఆధారంగా వచ్చే పాప పుణ్యాల గురించి మరణానతరం జీవి ప్రయాణం సహా అనేక విశేషాలున్నాయి. ఇవన్నీ మనిషి దైనందిన జీవనశైలిని మెరుగుపరచడానికి ఉపయోగపడే కొత్త ఆలోచనలను అందిస్తాయి. ఇహ పర లోకాల్లో మనిషి జీవితం సుఖంగా సాగిపోవాలంటే గరుడ పురాణం ప్రకారం ఐదు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

Garuda Puranam: ఈ ఐదు అలవాట్లు ఉన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదట.. వెంటనే మార్చుకోండి
Garuda Puranam
Surya Kala
|

Updated on: May 15, 2025 | 8:36 AM

Share

హిందూ మతంలో రామాయణ, మహాభారతం సహా అనేక పురాణాలు మనిషి జీవన విధానాన్ని, మనిషి జీవితంలో మంచి చెడుల గురించి వివరిస్తుంది. గరుడ పురాణంలో శ్రీ మహా విష్ణువు.. తన భక్తుడైన గరుత్మండికి మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది. ఇందులో జీవితం, మరణం, పునర్జన్మకు సంబంధించిన అన్ని రహస్యాలను వెల్లడిస్తుంది. ఆత్మల గురించి సహా మరెన్నో విషయాలను తెలియజేస్తుంది. దీనితో పాటు సరైన మార్గంలో నడుస్తూ జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించే మార్గం కూడా ఉంది. గరుడ పురాణంలో విష్ణువు మానవుని కొన్ని చెడు అలవాట్ల గురించి వివరించాడు. వీటిని ఎప్పుడూ అలవర్చుకోకూడదు. ఎందుకంటే అవి చెడు శకునాలని చెప్పాడు. ఈ చెడు అలవాట్ల ఫలితంగా మనుషులు పేదరికం, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం మనిషిలో ఉండకూడని ఐదు చెడు అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం.

రాత్రిపూట గుడ్లగూబలా ఉండకండి: నేటి సమాజంలో ప్రజలు రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా మేల్కొనే దినచర్యను అనుసరిస్తున్నారు. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం అనేది శాస్త్రాల ప్రకారం ప్రతికూల పద్ధతి. ఉదయం ఆలస్యంగా మేల్కొనే వారు నీరసంగా ఉంటారని.. జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగరని .. పురోగతి మార్గంలో అనేక అడ్డంకులు వస్తాయి. ఆర్ధికంగా ఎటువంటి ఎదుగుదల లేకపోతే అలాంటి వ్యక్తులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

శుభ్రత తప్పనిసరి: గరుడ పురాణం ప్రకారం ఇంటిని మురికిగా ఉంచుకునేవారు, ఉపయోగించిన పాత్రలను రాత్రి సమయంలో వంటగదిలో నిల్వ చేసే చెడు అలవాటు ఉన్నవారు శనిశ్వరుడి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు అటువంటి వ్యక్తులపై లక్ష్మీ దేవి కోపంగా ఉంటుంది. కనుక రాత్రి నిద్ర పోయే ముందు మురికి పాత్రలను శుభ్రం చేయడం అవసరం.

ఇవి కూడా చదవండి

స్వచ్ఛత- శ్రేయస్సు: గరుడ పురాణం ప్రకారం మురికి బట్టలు ధరించే వారి పట్ల లక్ష్మీ దేవికి ఆగ్రహం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీ దేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది. స్వచ్ఛత ఉన్న ప్రదేశాలలో నివసిస్తుంది. కనుక ఎవరైతే స్వచ్చంగా ఉంటారో అటువంటి వ్యక్తిపై ఎల్లప్పుడూ సంపద దేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు.

దురాశ: ఉన్నదానితో సంతృప్తి లేకుండా దురాశ పడే వ్యక్తులపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండదు. అలాంటి వ్యక్తులు జీవితంలోని నిజమైన సారాన్ని, ఆనందాన్ని ఎప్పటికీ అనుభవించలేరు. ఎవరైతే కష్టపడి డబ్బు సంపాదిస్తూ సాటి మనుషుల పట్ల దయతో ఉంటారో అటువంటి వ్యక్తులను లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది.

మనుషుని నిర్మలంగా ఉంచుకోండి: ఉద్దేశపూర్వకంగా ఇతరులకు హాని చేసే వారిని లక్ష్మీదేవి ఇష్టపడదని గరుడ పురాణం చెబుతుంది. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ డబ్బులకు ఇబ్బంది పడుతూ.. జీవితంలో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. కనుక మనసులో ఎటువంటి కల్మషం లేకుండా నవ్వుతూ నలుగురు మంచి కోరుకునేవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం సదా ఉంటుంది. సుఖ శాంతులతో జీవిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..