Thursday Puja Tips: విష్ణువు అనుగ్రహం కోసం గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం
గురువారం లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువుకి అంకితం చేయబడింది. అంతేకాదు దేవతల గురువైన బృహస్పతిని కూడా గురువారం పూజించడం శుభప్రదం అని నమ్మకం. ఎవరైతే గురువారం శ్రీ మహా విష్ణువుని భక్తి శ్రద్దలతో పూజిస్తారో వారి భక్తికి విష్ణువు సంతోషించి జీవితంలో ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాడు. ఈ రోజు విష్ణువు అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం..

హిందూ మతంలో వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. గురువారం ముఖ్యంగా విష్ణువు , బృహస్పతికి అంకితం చేయబడింది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం ద్వారా వ్యక్తి జీవితంలో శుభ ఫలితాలు పొందుతాడు. ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. జ్యోతిషశాస్త్రంలో కూడా ఇలాంటి అనేక పరిహారాలు ప్రస్తావించబడ్డాయి. వీటిని గురువారం నాడు ఆచరిస్తే విష్ణువు అనుగ్రహం పొందడంలో సహాయపడుతుంది. ఈ పరిహరాలను పూర్తి భక్తితో , క్రమం తప్పకుండా చేయడం వలన శ్రీ మహా విష్ణువు సంతోషిస్తాడు. జీవితంలో సానుకూల మార్పులు రావడం ప్రారంభిస్తాయి. అంతేకాదు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాంటి కొన్ని సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారాల గురించి తెలుసుకుందాం..
- శ్రీ విష్ణు స్తోత్రం లేదా విష్ణు సహస్రనామం చదవండి.. గురువారం ఉదయం స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, విష్ణువును ధ్యానిస్తూ శ్రీ విష్ణు స్తోత్రం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. భక్తితో పలికిన మాటలతో భగవంతుడిని స్తుతించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు.
- గురువారం రోజున గోపీ చందన తిలకం దిద్దుకోవడం చాలా శుభప్రదమని నమ్ముతారు. అంతేకాకుండా పేదలకు పండ్లు దానం చేయడం కూడా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది.ఇలా చేయడం వలన శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి.
- భగవద్గీతలోని పదకొండవ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించాడు. గురువారం ఈ అధ్యాయాన్ని క్రమం తప్పకుండా పఠించడం వల్ల జ్ఞానోదయం లభిస్తుంది. మీ జీవితంలోకి సానుకూల శక్తి వస్తుంది.
- గురవారం రోజున మందులు లేదా ఆరోగ్య సంబంధిత వస్తువులను అవసరమైన వారికి దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
- గురువారం నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. గురువారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు లేదా ఎవరి దగ్గరా అప్పు తీసుకోకూడదని నమ్మకం. ఈ రోజున చేసే లావాదేవీలు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలను తీసుకురావచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








