AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: జీవితంలో విజయం సొంతం కావాలంటే ఈ ముగ్గురు వ్యక్తులకు దూరంగా ఉండాలంటున్న చాణక్య

స్నేహం చందనం చెక్కలా ఉండాలట. దానిని ఎంత అరగాదీసినా సువాసన పోనట్లు.. నిజమైన స్నేహం కూడా ఎన్ని కష్ట, నష్టాలు వచ్చినా స్నేహ బంధం విలువ తగ్గదు అని అంటారు. అదే విధంగా కొంత మంది స్నేహం ఎప్పుడూ ప్రమాదమేనట. కొంతమంది వ్యక్తులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదట. ఇటువంటి వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపితే జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. ఆ వ్యక్తులు ఎవరో ఈ రోజు తెలుసుకుందాం..

Chanakya Niti: జీవితంలో విజయం సొంతం కావాలంటే ఈ ముగ్గురు వ్యక్తులకు దూరంగా ఉండాలంటున్న చాణక్య
Chanakya Niti
Surya Kala
|

Updated on: May 15, 2025 | 8:03 AM

Share

ఆచార్య చాణక్యుడు తన విధానాలను నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. ఆచార్య చాణక్యుడు పూర్వకాలంలో అత్యంత జ్ఞానవంతుడు, రాజనీతజ్ఞుడు కూడా పేరు పొందాడు. తన జీవితకాలంలో అర్ధ శాస్త్రం, నీతి శాస్త్రం, పంచ తంత్ర అనేక రకాల పుస్తకాలను రచించాడు. అందులో ఒకటి చాణక్య నీతి. ఇందులో ఆచార్య చాణక్యుడు మనిషి జీవితంలో విజయ సాధించాలంటే ఏమి చేయాలి? ఏమి చేయకూడదో కూడా చెప్పాడు. కొంతమంది వ్యక్తులతో స్నేహం మాత్రమే కాదు పరిచయం కూడా జీవితంలో మిమ్మల్ని ఎదగనివ్వరని చెప్పాడు. అటువంటి వ్యక్తుల గురించి తన నీతి శాస్త్రం ప్రస్తావించాడు. ఎవరైనా సరే ఎక్కువ సమయం ఇటువంటి వ్యక్తులతో గడిపితే.. పూర్తి చేసిన పని కూడా చెడిపోవడం ప్రారంభమవుతుంది. కనుక ఇటువంటి వ్యక్తులకు వీలైంత వరకూ దూరంగా ఉండమని సూచించాడు. వారు ఎవరో తెలుసుకుందాం..

తెలివితక్కువ వ్యక్తులకు దూరంగా

ఆచార్య చాణక్యుడి ప్రకారం ఎవరైనా సరే ఎప్పుడూ మూర్ఖులతో సహవాసం చేయరాదు. వీలైనంత వరకూ మూర్ఖులకు దూరంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు, తమను తాము ఉన్నతంగా, ఉత్తమంగా భావిస్తుంటారు. ఎవరైనా మూర్ఖుడితో గడిపితే అతను మీకు ఎంత దూరంలో ఉన్నా అతను మీ పనిని, మీ సమయాన్ని పాడు చేస్తాడు. మూర్ఖులు జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని, ఈ నిర్ణయాలు మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.

ఎప్పుడూ ఏడ్చే వ్యక్తి

చాణక్య నీతి ప్రకారం ప్రతి చిన్న విషయానికి ఏడ్చేవారు లేదా ఎటువంటి పనిలోనైనా తప్పులు వెదికే అలవాటు ఉన్న వ్యక్తుల నుంచి మీరు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తుల నుంచి మీరు వీలైనంత దూరం పాటించాలి. ఇలాంటి వ్యక్తులు చాలా ప్రతికూల మనస్తత్వం కలిగి ఉంటారు. ఆ మనసతత్వం మీపై కూడా ప్రభావం చూపుతుంది. ఇలాంటి వ్యక్తుల వల్ల చాలాసార్లు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి గుణం ఉన్న స్త్రీలకు దూరంగా

ఆచార్య చాణక్యుడి ప్రకారం తనను తాను అందరికంటే ఉత్తమురాలిగా, ఉన్నతంగా భావించే స్త్రీ నుంచి మీరు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఇలాంటి స్త్రీలకు అబద్ధం చెప్పడం చాలా బాగా తెలుసు. ఇది మాత్రమే కాదు అలాంటి స్త్రీలు కొన్నిసార్లు అబద్ధాలతో, కఠినమైన మాటలతో ఇతరులను బాధపెట్టడానికి కూడా వెనుకాడరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us
నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. శ్రీ కుంకుళ్లమ్మ దీక్షలతో
నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. శ్రీ కుంకుళ్లమ్మ దీక్షలతో
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!