AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Om Chanting: శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రోజూ 30 నిముషాలు ఓం ప‌ఠించి చూడండి..

హిందూ ధర్మంలో ఓం శబ్దానికి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. "ఓం" అనేది ఆది శబ్దంగా పరిగణించబడుతుంది. ధ్యానం లేదా యోగా సెషన్లలో ఓం ను పటించడం వల్ల శారీరక, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. అంతేకాదు ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు దైవంతో సంబంధాన్ని సులభతరం చేయడంలో సహాయపడుతుంది. అయితే రోజూ 30 సార్లు ఓం అని ప‌ఠిస్తే క‌లిగే అద్భుతమైన లాభాలు అనేకం.

Om Chanting: శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రోజూ 30 నిముషాలు ఓం ప‌ఠించి చూడండి..
Om Chanting
Surya Kala
|

Updated on: May 14, 2025 | 11:13 AM

Share

ఓం శబ్దానికి హిందూ ధర్మంలో విశిష్ట స్థానం ఉంది. ఓం చిహ్నం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడితో ముడిపడి ఉంటుంది. “ఓం” ప్రతి భాగం త్రిమూర్తులోని విభిన్న కోణానికి అనుగుణంగా ఉంటుంది.

జ (अ): విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడిని సూచిస్తుంది.

ఉ (ఉ): సంరక్షకుడు, పోషకుడు అయిన విష్ణువును సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

M (m): విధ్వంసకారుడు, పరివర్తనకర్త అయిన శివుడిని సూచిస్తుంది.

అటువంటి ఓంకార శబ్దంతో అధ్యత్మికంగానే కాదు శారీరకంగా కూడా అనేక ప్రయోజనాలు ఇస్తుందని ఓ బాలిక నిరూపించింది. ఓం శారీరక మానసిక అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ ప్రదర్శనలో ప్రయోగాత్మకంగా నిరూపించింది. ఆ బాలిక నిరూపించిన విధానం శాస్త్రవేత్తలను కూడా ఆకట్టుకుంది.

కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ అనే బాలిక ఓం శబ్దం వినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ప్రయోగాత్మకంగా నిరూపించింది. ఇందు కోసం ఆ బాలిక 17 మంది యువతీ, యువకులను ఎంచుకుని వారికి ప్రశాంత వాతావరణంలో ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించింది. తర్వాత వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాన్ని లెక్కించింది. ఓం శబ్దంతో విన్న తర్వాత ఆ యువతీ యువకుల శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గడం గమనించింది. అంతేకాదు రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గి.. అలసట దూరం అవుతుందని నిరూపించింది.

అసలు ఓం శబ్ధంకి ఉన్న శక్తిని గురించి ఆలోచన తెలుసుకోవాలనే ఆసక్తిని అన్వేష ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర సమయంలో వచ్చినట్లు తెలుస్తోంది. అన్వేష బగేశ్వర్ నుంచి 68 కి.మీ. దూరంలో ఉన్న కేదారీనాథ్‌కు కొంతమంది పూజారులు రోజూ కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో పుజరుల్లో ఎటువంటి ఆయాసం, అలసట కనిపించడం లేదని గుర్తించింది. ఎలా ఇలా అంటూ ఆశ్చర్యంగా ఆ పూజారులను అబ్జర్వ్ చేసింది. అప్పుడు పూజారులు నీటిని తీసుకుని వెళ్తూ.. ఓం కారాన్ని జపిస్తూ వెళ్తున్న విషయాన్నీ గుర్తించింది. ఓం శబ్దమే వారికి శారీరక మానసిక శక్తిని ఇస్తుందని భావించి ఓంకారంపై ప్రయోగాన్ని చేయాలని భావించింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌనః పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించింది. ఈ విషయాన్నీ నిర్ధారించుకోవడానికి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.

30 నిమిషాలు ఓం జపిస్తే ఏమవుతుంది?

“ఓం” అని 30 నిమిషాలు ఎక్కువసేపు జపించడం వల్ల మనస్సు, శరీరం, ఆత్మపై తీవ్ర ప్రభావాలు ఉంటాయి. ఈ శబ్దం లయబద్ధంగా పునరావృతం చేయడం ధ్యాన స్థితిని ప్రేరేపిస్తుంది. విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. “ఓం” కంపనాలు స్వర తంతువుల ద్వారా, శరీరంలో ప్రతిధ్వనిస్తాయి కనుక ఓం కార నాదం నాడీ వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని, మనస్సును ప్రశాంతపరుస్తుందని, మానసిక స్పష్టతను పెంచుతుందని నమ్మకం. ధ్యానం మనిషిని ట్రాన్స్‌లోకి వెళ్ళేలా చేస్తుంది. దీంతో అంతర్గత శాంతి, ఆధ్యాత్మిక సంబంధాన్ని సులభతరం చేస్తుంది.

ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌనఃపున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి. ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..