AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peanut butter or Almond butter: పీనట్ బటర్ లేదా బాదం బటర్… వీటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది

ఫిట్‌నెస్ కోసం తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇందులో వేరుశెనగ వెన్న , బాదం వెన్నకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. రెండిటిలో పోషకాలు సమృద్ధిగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి ప్రయోజనం అనేది తెలుసుకుని ఎంచుకోవడం సరైనది. వేరుశెనగ వెన్న ఎక్కువ ప్రయోజనకరమా లేదా బాదం వెన్న అనేది ఈ రోజు తెలుసుకుందాం.

Peanut butter or Almond butter: పీనట్ బటర్ లేదా బాదం బటర్... వీటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
Peanut Butter Or Almond Butter
Surya Kala
|

Updated on: May 14, 2025 | 10:07 AM

Share

ప్రస్తుతం అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మంది ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఫిట్‌నెస్ కోసం వ్యాయామంతో పాటు తినే ఆహారంపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. తినే ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉండేలా చూసుకుంటారు. ఈ సందర్భంలో వేరుశెనగ వెన్న , బాదం వెన్న చాలా ఇష్టపడతాయి. ఈ రెండు వెన్నలు వ్యాయామం చేసే వ్యక్తుల ఆహారంలో ముఖ్యమైన భాగం.

పీనట్ బటర్ లేదా బాదం బటర్ లో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఏది ఎంచుకోవడం మంచిది అనే ప్రశ్న తలెత్తుతుంది. రెండు వెన్నలలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ రెండింటి పోషకాలు భిన్నంగా ఉంటాయి. వేరుశెనగ వెన్నలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. అయితే బాదం వెన్నలో ఎక్కువ విటమిన్ E ఉంటుంది. కనుక మీరు పీనట్ బటర్ లేదా బాదం బటర్ లో ఏది ఎంచుకోవాలా అని గందరగోళంగా ఉంటే. ఈ రోజు వేరుశెనగ , బాదం వెన్నలలో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం..

పీనట్ బటర్, బాదం బటర్ న్యూట్రిషన్

వేరుశెనగ వెన్న, బాదం వెన్న రెండిటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వేరుశెనగ వెన్నలో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ E, B3, మెగ్నీషియం, ఫోలేట్, భాస్వరం ఉంటాయి. బాదం వెన్నలో విటమిన్ E ఎక్కువగా ఉంటుంది. ఇది మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు (మంచి కొవ్వులు), ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంటే

ఫిట్‌నెస్ ప్రియులకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకాహారం. అలాంటి సందర్భంలో పీనట్ బటర్ లేదా బాదం బటర్ ను ఎంచుకుంటారు. అయితే ఈ రెండింటిలోని ప్రోటీన్ కంటెంట్ తెలుసుకోవాలనుకుంటే.. ఒక చెంచా వేరుశెనగ వెన్నలో 4 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అయితే 1 చెంచా బాదం వెన్నలో 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాంటి సందర్భంలో కండరాలను నిర్మించేవారికి వేరుశెనగ వెన్న ప్రోటీన్ మంచి మూలం.

పోషకాలు  వేరుశెనగ వెన్న (2 టేబుల్ స్పూన్లు)       బాదం వెన్న (2 టేబుల్ స్పూన్లు)

  1. కేలరీలు            190 కిలో కేలరీలు                               200 కిలో కేలరీలు
  2. ప్రోటీన్              8 గ్రా                                                      6-7గ్రా
  3. ఫైబర్                2 గ్రా                                                      3 గ్రా
  4. ఆరోగ్యకరమైన కొవ్వులు మోనోశాచురేటెడ్ మోనో     అన్‌శాచురేటెడ్ (కొంచెం ఎక్కువ)
  5. చక్కెర               తక్కువ                                                 తక్కువ
  6. విటమిన్ ఇ         తక్కువ                                               ఎక్కువ
  7. మెగ్నీషియం     మంచి మూలం                                మెరుగైన వనరులు

పీనట్ బటర్, బాదం బటర్ లో ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశెనగ వెన్న ప్రోటీన్ మంచి మూలం. అటువంటి పరిస్థితిలో ఇది శాఖాహారులకు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి (మోనోశాచురేటెడ్ కొవ్వు) మంచిది. ఇది చౌకైన , సులభంగా లభించే వెన్న కూడా. మరోవైపు బాదం వెన్న విటమిన్ E మంచి మూలం. ఇది చర్మానికి, యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలకు మంచిది. ఇందులో ఫైబర్ , మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇది జీర్ణక్రియ , రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది.

రెండిటిలో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందంటే

మీరు చౌకైన, ప్రోటీన్ అధికంగా ఉండే వెన్నని తీసుకోవాలనుకుంటే వేరుశెనగ వెన్న మంచి ఎంపిక. ఇది శక్తినిచ్చే , గుండెకు ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటుంది. మరోవైపు ఫైబర్, విటమిన్ E, మెగ్నీషియం వంటి పోషకాలకు ప్రాధాన్యత ఇచ్చినా లేదా వేరుశెనగ తింటే అలెర్జీ ఉన్నవారు బాదం వెన్నని ఎంచుకోవడం మంచిది. ఇది చర్మం, జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణకు మరింత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మొత్తంమీద బడ్జెట్ పరిమితంగా ఉండి.. ప్రోటీన్ కావాలి అనుకుంటే వేరుశెనగ వెన్నను ఎంచుకోండి. అయితే శరీరానికి అధిక మొత్తంలో పోషకాలు కావాలనుకుంటే బాదం వెన్న మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)