- Telugu News Photo Gallery Healthy Breakfast Ideas in Telugu: Best grain breakfast for boost energy and stay healthy
Healty Breakfast: రోజుని ఆరోగ్యకరమైన ఈ ఐదు టిఫిన్స్ తో మొదలు పెట్టండి.. పుష్కలమైన శక్తి మీ సొంత
ఆరోగ్యంగా ఉండాలంటే అల్పాహారం స్కిప్ చేయవద్దు అని నిపుణులు చెబుతారు. మన దేశంలో అల్పాహారం విషయంలో కూడా భిన్న రుచులున్నాయి. కొంతమంది ఉదయం టీతో పాటు బ్రెడ్, రస్క్, నమ్కీన్ మొదలైన వాటిని తినడానికి ఇష్టపడతారు. మరికొందరు అల్పాహారంలో బంగాళాదుంప పరాఠా, పూరీ మొదలైన వాటిని కూడా తీసుకుంటారు. అయితే మరికొందరు ఇడ్లి, ఉప్మా వంటి వాటిని తింటారు. ఈ రోజు రోజుని మొదలు పెట్టే ఆరోగ్యకరమైన అల్పాహారాల గురించి తెలుసుకుందాం, ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పుష్కలంగా శక్తిని ఇస్తాయి.
Updated on: May 14, 2025 | 9:08 AM

భారతదేశంలో చాలా మంది ఉదయం టీతో రోజుని ప్రారంభిస్తారు. అల్పాహారం పేరుతో టీతో పాటు కుకీలు, బిస్కెట్లు, నమ్కీన్ మొదలైన వాటిని తీసుకుంటారు. ఇవి శరీరానికి దాదాపు ఎటువంటి పోషకాలను అందించవు. పైగా ఆరోగ్యానికి హానికరం. ఉప్పు కలిపిన స్నాక్స్, టీతో బిస్కెట్లు వంటివి తినడం అసిడిటీకి కారణమవుతాయి. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే రాత్రంతా ఏమీ తినకపోవడంతో కడుపు ఖాళీగా ఉంటుంది. కనుక ఉదయం తీసుకునే అల్పాహారం మధ్యాహ్నం భోజనం చేసే వరకు శక్తిని ఇస్తుంది. కనుక టిఫిన్ గా ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం ముఖ్యం. ఎవరైనా సరైన అల్పాహారం తీసుకోక పోయినా లేదా అల్పాహారంలో ఆరోగ్యకరమైనవి తినకపోయినా త్వరగా అలసిపోవడమే కాదు త్వరగా స్నాక్స్ ని తినాలని కోరుకుంటారు. ఇలా అనారోగ్యకరమైన స్నాక్స్ తినడం వల్ల బరువు పెరుగుతారు.

ఆరోగ్యంగా ఉండటానికి మీరు మీ ఆహారంలో వివిధ రకాల ధాన్యాలతో చేసిన ఆహారాన్ని చేర్చుకోవాలి, ఎందుకంటే ఇవి శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తాయి. వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజు ఆరోగ్యకరమైన అల్పాహారాల గురించి ఈ రోజు తెలుసుకుంటాము. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి కూడా.

తెప్లా: గుజరాతీ ప్రజల అల్పాహారం. తెప్లా, రుచికరమైనది మాత్రమే కాదు. పోషకాలతో కూడా నిండి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది దీనిని మల్టీగ్రెయిన్, సాధారణంగా చిక్‌పా , మిల్లెట్ పిండి, గోధుమ పిండితో తయారు చేస్తారు. శీతాకాలంలో కసూరి మెంతిని తెప్లాలో కూడా ఉపయోగిస్తారు. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తెప్లాను వేయించడానికి, శుద్ధి చేసిన నూనెకు బదులుగా దేశీ నెయ్యి లేదా ఇంట్లో తయారుచేసిన వెన్నను ఉపయోగించవచ్చు.

మల్టీగ్రెయిన్ పిండి: పెసర పప్పు, శనగపిండి, సుజీ, మొక్కజొన్న పిండి కలిపి మల్టీగ్రెయిన్ చీలా తయారు చేసుకుని అల్పాహారంగా తినవచ్చు. రోజువారీ ఇబ్బందులను నివారించడానికి అన్ని పదార్థాలను కలిపి రుబ్బుకుని సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఈ చీలాకు వివిధ రకాల కూరగాయలను జోడించడం వల్ల ఇది మరింత ఆరోగ్యకరమైన అల్పాహారంగా మారుతుంది.

సుజీ ఉప్మా లేదా పాన్‌కేక్: ఉదయం గోధుమలతో చేసిన లేదా సుజీ ఉపయోగించి ఉప్మా లేదా పాన్కేక్ తయారు చేసుకోవచ్చు. ఈ రెండు ఆహారాలు కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండు విషయాలలోనూ నూనెను పరిమిత పరిమాణంలో ఉపయోగిస్తారు. కనుక ఇది ఫిట్‌నెస్ దృక్కోణంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఓట్స్: అల్పాహారంలో ఓట్స్ తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్స్ తో తయారు చేసే ఓట్ ఆహారంలో ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, ఫాస్పరస్, రాగి, ఇనుము, సెలీనియం, విటమిన్ బి1, జింక్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మీకు శక్తిని ఇవ్వడంలో పాటు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

బార్లీ: ఆరోగ్యకరమైన అల్పాహారంగా బార్లీ వంటకాలు బెస్ట్ ఎంపిక. బార్లీ కిచిడి, బార్లీ ఉప్మా, బార్లీ గంజిని ఉదయమే అల్పాహారంగా తీసుకోవచ్చు. బార్లీ గంజిని సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. బార్లీ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉన్న ధాన్యం కనుక వేసవి కాలంలో బార్లీ గంజిని తీసుకోవాలి. మీరు పాలతో తీపి గంజి చేయవచ్చు లేదా ఉప్పు గంజిని పెసలుతో కలిపి తయారు చేసుకోవచ్చు. దీనికి వేరుశనగపప్పు జోడించడం వల్ల రుచితో పాటు పోషకాలు కూడా పెరుగుతాయి.




