AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: జాతకంలో గురు స్థానం బలహీనంగా ఉందా.. ఈ పరిహారాలు చేసి చూడండి..

మనిషి జీవితంలో చోటు చేసుకునే మంచి చెడులకు జాతకంలో గ్రహాల ప్రభావానికి ప్రత్యేక స్థానం ఉంది. కనుక జాతకంలో గ్రహాల స్థానం బలంగా ఉండలని జ్యోతిష్కులు చెబుతారు. అంతేకాదు ఎవరి జాతకంలోనైనా గ్రహ స్థానం బలహీనంగా ఉంటె తగిన పరిహరాలను సూచిస్తారు. మీ జాతకంలో బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని నివారణలను చేయడం వలన జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది. జీవితంలోని సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

Astro Tips: జాతకంలో గురు స్థానం బలహీనంగా ఉందా.. ఈ పరిహారాలు చేసి చూడండి..
Astro Tips For Brihaspati
Surya Kala
|

Updated on: May 14, 2025 | 8:26 AM

Share

హిందూ మతంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. జ్యోతిషశాస్త్రంలో ఆవు బృహస్పతి గ్రహానికి చిహ్నం. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల గురువు ప్రభావం బలపడుతుంది. ఆవులకు ఆహారం పెట్టడం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, సామాజికంగా, పర్యావరణపరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతను, కుటుంబంలో ఆనందాన్ని, జీవితంలో శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఆవును దేవతగా పూజిస్తారు. ఆవులకు ఆహారం పెట్టడం కేవలం ఒక సంప్రదాయం కాదు. దీని వెనుక లోతైన మతపరమైన, ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఈ సంప్రదాయం పురాతన కాలంలో ఎంత ప్రభావవంతంగా ఉందో నేటికీ అంతే ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. రోజూ ఆవుకు ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఆవుకు ఆహారం ఇవ్వడంలో ప్రాముఖ్యత

అవును గోమాత అని అంటారు. గోవులో కోట్లాది దేవతలు కొలువై ఉన్నారని నమ్ముతారు. దీనితో పాటు ఆవును భూమి దేవికి చిహ్నంగా కూడా చూస్తారు. బౌద్ధమతంలో కూడా ఆవులను పవిత్రంగా భావిస్తారు. పూజిస్తారు. కనుక ఒక ఆవుకి ఆహారం అందించడం అంటే సమస్త దేవతలకు ఆహారం పెట్టడంతో సమానం. సకల దేవతల ఆశీస్సులను కలిసి పొందుతారు.

రోజూ ఆవుకు ఆహారం పెట్టే వ్యక్తికి దేవుని ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలలో ప్రస్తావించబడింది. ఆవుకు బెల్లం తినిపించడం యజ్ఞం లేదా దానం చేసినంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. శని , పితృ దోషాలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆవుకు ఆహారం, మేత లేదా బెల్లం తినిపించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలోని దోషాలు తగ్గడమే కాదు జీవితంలో అదృష్టం, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

శాస్త్రీయ విధానం, ప్రయోజనాలు

ఆవుకు ఆహారం పెట్టడం వెనుక ఆధ్యాత్మిక కారణాలు మాత్రమే కాదు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. మనం ఆవులకు ఆహారం తినిపించినప్పుడు అది మానవాళి శ్రీయస్సుని ప్రతిబింబించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతకు కూడా సహాయపడుతుంది. ఈ సంప్రదాయం సమాజంలో గోవుల పెంపకాన్ని, గో రక్షణను ప్రోత్సహిస్తుంది. గోసంరక్షణ ఒక విధంగా సేంద్రీయ వ్యవసాయం, సహజ ఎరువులు, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తుంది. ఆవులు ఆరోగ్యంగా.. సురక్షితంగా ఉన్నప్పుడు, వాటి ఉత్పత్తులు అయిన పాలు, పేడ, గోమూత్రం మొదలైనవి సమాజానికి మేలు చేస్తాయి. ఈ దృక్కోణంలో కూడా ఆవుకు ఆహారం ఇవ్వడం సామాజిక, పర్యావరణ బాధ్యతకు చిహ్నంగా మారుతుంది.

ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. ఆవులకు క్రమం తప్పకుండా మేత వేసే ఇళ్లలో వాతావరణం సానుకూలంగా, ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి కుటుంబాలలో పరస్పర సహకార భావన అభివృద్ధి చెందుతుంది. ఇంట్లో టెన్షన్ తగ్గుతుంది. ఇది జీవితంలోకి సానుకూల శక్తిని తెస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్