- Telugu News Photo Gallery Spiritual photos Lucky Zodiac Signs in 2025: Major Planetary Shifts to bring luck for these zodiac signs
Lucky Zodiac Signs: రాశులు మారనున్న 4 ప్రధాన గ్రహాలు.. వారు అత్యంత అదృష్టవంతులు..!
Telugu Astrology: ఈ ఏడాది నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారడం దాదాపు ప్రతి రాశినీ ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశిలోనూ ఎక్కువ కాలం సంచారం చేసే శని, రాహువు, కేతువు, గురువు రాశులు మారడం వల్ల కొన్ని రాశుల వారు ఈ ఏడాది అత్యంత అదృష్టవంతులుగా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అయిదు రాశుల వారి జీవితాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు, పెళ్లి, ప్రేమలు, ఆదాయం, సంతానం వంటి విషయాల్లో వీరికి బాగా కలిసి వచ్చే సూచనలున్నాయి. వృషభం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి మే 25 తర్వాత నుంచి అన్ని విధాలుగానూ దశ తిరగబోతోంది.
Updated on: May 14, 2025 | 3:55 PM

వృషభం: ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడితో పాటు నాలుగు ప్రధాన గ్రహాల అనుగ్రహం వల్ల జీవనశైలి మారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం, వృత్తి, వ్యాపారాల్లో అపా రంగా లాభాలు వృద్ధి చెందడం, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.

సింహం: రాశ్యధిపతి రవితో పాటు ఏకంగా మూడు ప్రధాన గ్రహాలు అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందు తుంది. ఉద్యోగంలో ఆదారాభిమానాలతో పాటు హోదా, జీతభత్యాలు కూడా బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాల బాటపడతాయి. ఆస్తిపాస్తులు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై భూలాభాలు కలుగుతాయి. విదేశీ సంపాదనకు కూడా అవకాశం ఉంది.

తుల: రాశ్యధిపతి శుక్రుడితో పాటు, నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచారం చేయబోతున్నందువల్ల ఈ రాశివారికి ఆదాయానికి లోటుండదు. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా రెట్టింపు ఫలితా లుంటాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. భారీ ప్రాజెక్టులను, లక్ష్యాలను చేపట్టి భాగ్యవంతులయ్యే అవకాశం ఉంది. సంపన్నులతో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చ యం కావడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం అంచనాల్ని మించుతుంది.

ధనుస్సు: అదృష్టానికి, వృద్ధికి, పురోగతికి కారకుడైన రాశ్యధిపతి గురువుతో పాటు రాహుకేతువులు, కుజుడు, రవి కూడా అనుకూలంగా సంచారం చేయబోతున్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. అనుకోకుండా ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీల వంటివి బాగా లాభిస్తాయి.

మీనం: అదృష్ట కారకుడు, రాశ్యధిపతి అయిన గురువుతో పాటు రాహుకేతువులు, కుజుడు కూడా అను కూల సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఈ ఏడాది అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. ధన ధాన్య సమృద్ది కలుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అనేక విధాలుగా వృద్ధి చెందుతాయి. సంతాన ప్రాప్తి సూచనలున్నాయి. ప్రముఖులతో లాభాదాయక పరిచయాలు, ఒప్పందాలు కలుగుతాయి.



