AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో సుఖ, సంతోషాల కోసం పక్షుల చిత్రాలను ఏ దిశలో పెట్టుకోవాలంటే..

వాస్తు శాస్త్రంలో ఇంట్లో పెట్టే వస్తువులు, ఫోటోల విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. ఇల్లు అందంగా కనిపించేందుకు ఇంట్లో పెట్టుకునే పక్షుల చిత్రాలను వివిధ దిశలలో ఉంచడం వల్లవిభిన్న ప్రభావాలు ఉంటాయి. పక్షులను స్వేచ్ఛ, సానుకూలత, శక్తికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల పక్షుల చిత్రాలను సరైన దిశలో ఉపయోగించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు చేకూరుతాయి.

Vastu Tips: ఇంట్లో సుఖ, సంతోషాల కోసం పక్షుల చిత్రాలను ఏ దిశలో పెట్టుకోవాలంటే..
Vastu Tips For Birds Pics
Surya Kala
|

Updated on: May 14, 2025 | 9:40 AM

Share

హిందూ మతంలో పక్షుల చిత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం హిందూ మతంలో పక్షులను శుభప్రదంగా భావిస్తారు. అవి ఇంటికి సానుకూల శక్తిని తెస్తాయి. పక్షుల చిత్రాలు “ప్రాణ” (సానుకూల శక్తి) ప్రవాహాన్ని పెంచుతాయని, ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తాయని నమ్ముతారు. వివిధ ప్రయోజనాల కోసం పక్షుల చిత్రాలను ఉంచడానికి వివిధ దిశలకు వాటి సొంత ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకు తూర్పు దిశ సానుకూలతకు, కొత్త ప్రారంభాలకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఉత్తర దిశ సంపద, అవకాశాలకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. పక్షులను బోనులలో పెట్టి పెంచుకోవడం వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది కాదు. ఎందుకంటే స్వేచ్చగా జీవించే పక్షులను బోనులో పెట్టి పెంచడం వలన పక్షుల సహజ శక్తిని పరిమితం చేస్తుందని నమ్ముతారు. అయితే పక్షుల చిత్రాలు, విగ్రహాలను సానుకూలంగా పరిగణిస్తారు.

పక్షుల చిత్రాలను ఏ దిశలో ఉంచాలి?

  1. ఉత్తర దిశ: వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశను సంపద, అవకాశాల దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో రంగురంగుల ఎగిరే పక్షుల చిత్రాలను ఉంచడం ద్వారా.. కెరీర్‌లో కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రతికూల శక్తిని తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
  2. తూర్పు దిశ: తూర్పు దిశ సూర్యోదయం దిశ, ఇది కొత్త ప్రారంభాలు, సానుకూల శక్తి, పెరుగుదలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో పక్షుల చిత్రాలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత, ఆనందం, పురోగతి వస్తాయి. ఇది సంబంధాలలో మాధుర్యాన్ని తీసుకురావడంలో కూడా సహాయపడుతుంది.
  3. దక్షిణ దిశ: దక్షిణ దిశ శక్తి , కీర్తితో ముడిపడి ఉంది. ఈ దిశలో పక్షుల చిత్రాలను ఉంచడం వల్ల సామాజిక ప్రతిష్ట, గుర్తింపు పెరుగుతుంది. అయితే కొంతమంది వాస్తు నిపుణులు ఈ దిశలో ఎక్కువగా కదిలే పక్షుల చిత్రాలను ఉంచకుండా ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే ఇది అశాంతిని కలిగిస్తుంది.
  4. పశ్చిమ దిశ: పశ్చిమ దిశను స్థిరత్వం, లాభాల దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో పక్షులు కూర్చున్న లేదా గుంపుగా ఉన్న చిత్రాన్ని ఉంచడం వల్ల జీవితంలో స్థిరత్వం , ఆర్థిక లాభం లభిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఈశాన్య దిక్కు: ఈ దిక్కును అత్యంత పవిత్రమైనదిగా , ఆధ్యాత్మికమైనదిగా భావిస్తారు. ఈ దిశలో ప్రశాంతమైన , అందమైన పక్షుల చిత్రాలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల, ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. ఇది జ్ఞానం, విద్య ,మానసిక ప్రశాంతతకు శుభప్రదం.
  7. ఆగ్నేయ దిక్కు: ఈ దిశ అగ్ని, శక్తికి సంబంధించినది. ఈ దిశలో శక్తివంతమైన, రంగురంగుల పక్షుల చిత్రాలను ఉంచడం ద్వారా, ఇంట్లో ఉత్సాహం, సానుకూలత ఉంటాయి. ఇది వ్యాపారానికి , సృజనాత్మక పనికి శుభప్రదంగా ఉంటుంది.
  8. వాయువ్య దిక్కు: ఈ దిశ గాలి , కదలికకు సంబంధించినది. ఈ దిశలో ఎగిరే పక్షుల చిత్రాన్ని ఉంచడం వల్ల కొత్త అవకాశాలు, ప్రయాణాల అవకాశం పెరుగుతుంది. ఇది స్నేహితులు , సామాజిక సంబంధాలకు కూడా శుభప్రదం.
  9. నైరుతి దిక్కు: ఈ దిశ స్థిరత్వం , సంబంధాలతో ముడిపడి ఉంటుంది. ఈ దిశలో రెండు పక్షుల చిత్రాన్ని ఉంచడం వల్ల వైవాహిక జీవితంలో మాధుర్యం, స్థిరత్వం వస్తాయి. ఒంటరి పక్షి చిత్రాన్ని మాత్రం పెట్టవద్దు. ఎందుకంటే ఒంటరి పక్షి ఒంటరితనాన్ని కలిగిస్తుంది.

సరైన దిశను ఎంచుకోవడం ముఖ్యం

మీరు మీ ఇంట్లో పక్షుల చిత్రాలను ఉంచినప్పుడల్లా.. ఆ చిత్రాలు ఎల్లప్పుడూ శుభ్రంగా , మంచి స్థితిలో ఉండాలి. అస్పష్టంగా ఉన్న లేదా చిరిగిన ఫోటోలు ప్రతికూల శక్తిని తెస్తాయి. హింసాత్మక లేదా ప్రతికూల వ్యక్తీకరణలతో పక్షుల చిత్రాలను ఉంచవద్దు. ఎల్లప్పుడూ ప్రశాంతమైన, అందమైన, సానుకూల పక్షుల చిత్రాలను పెట్టుకోండి. మీ వ్యక్తిగత ప్రాధాన్యత, ఇంటి శక్తి ప్రకారం పక్షుల చిత్రాలను ఎంచుకోండి. ఇంటిలో సరైన దిశలో పక్షుల చిత్రాలను ఉంచడం వల్ల సానుకూల శక్తి, శ్రేయస్సు, ఆనందం , మంచి సంబంధాలు ఏర్పడతాయి. కనుక మీ అవసరాలు, వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశను ఎంచుకోవడం ముఖ్యం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!