Gold and Silver Price Today: స్వల్పంగా దిగి వచ్చిన పసిడి.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
భారతీయులకు బంగారం కొనుగోలు చేయడం భలే ఇష్టం. ఈ ఇష్టంతోనే ఎటువంటి సందర్భం వచ్చినా సరే వెంటనే బంగారం నగలు కొనుగోలు చేయడనికి ఆసక్తిని చూపిస్తారు. అందుకనే ప్రతి సంవత్సరం టన్నులకు టన్నుల బంగారం మన దేశం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో పరిస్థితి ఆధారంగా దేశీయంగా కూడా పసిడి వెండి ధరలపై ప్రభావం చూపిస్తాయి. పసిడి , వెండి ధరల్లో హెచ్చుతగ్గులుఏర్పడతాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

భారతీయులు బంగారం నగలను ఓ స్టేటస్ సింబల్ గా మాత్రమే కాదు ఎప్పుడైనా అనుకోని విధంగా ఆర్ధిక ఇబ్బందులు కలిగే అప్పుడు బంగారం ఆదుకుంటుందని .. ఆర్ధిక భరోసా ఇస్తుందని నమ్మకం. అందుకనే పండగలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఇలా ఏ సందర్భం వచ్చినా .. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు.. ఏడాది పొడవునా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తినిమ చూపిస్తూ ఉంటారు. అదే సమయంలో ప్రస్తుతం బంగారం, వెండిపై పెట్టుబడులను పెట్టడానికి ముదుపర్లు ఆసక్తిని చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బంగారం ధర ఆల్ టైం హైకి చేరుకొని పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. అయితే అంతర్జాతీయ మార్కట్ లో డాలర్ బలపడడంతో నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఈ క్రమంలో ఈ రోజు (మే 14 వ తేదీ) గురువారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో మే 14 వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే…
హైదరాబాద్ లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,040 ఉండగా.. 24 క్యారెట్ల (మేలిమి బంగారం) 10 గ్రాముల బంగారం ధర రూ.96,050 లుగా కొనసాగుతోంది. ఇవే ధరలు తెలుగురాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, పొద్దుటూరులలో కొనసాగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 88,040గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,200 లుగా ఉంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 88,040 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 96,050 వద్ద కొనసాగుతోంది. ఇవే ధరలు దేశంలో ప్రధాన నగరాలైన కేరళ, కోల్ కతా, పూణే, బెంగళూరు లో కూడా కొనసాగుతున్నాయి.
ఈ రోజు దేశంలో వెండి ధర ఎలా ఉన్నదంటే..
బంగారంతో పాటు వెండి కూడా మంచి ఆదరణ ఉంది. ఎటువంటి సందర్భం వచ్చినా బహుమతులుగా వెండి వస్తువులు ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే గతంలో కంటే ఇప్పుడు వెండితో రకరకాల ఆభరణాలను తయారు చేస్తున్నారు. ఇవి నేడు ట్రెండీగా నిలుస్తున్నాయి. ఈ నేపధ్యంలో కిలో వెండి ధర ఒకానొక సమయంలో లక్ష దాటింది కూడా.. ఈ నేపధ్యంలో నేటి వెండి ధర ఎలా ఉన్నదో తెలుసుకుందాం.. దేశ వ్యాప్తంగా పసిడి బాటలో నడుస్తూ వెండి ధర స్వల్పంగా దిగి వచ్చింది. ఈ నేపద్యంలో రోజు గురువారం కేజీ వెండి ధర రూ. 1,08,900లు ఉండగా.. ఇదే ధర కేరళ, చెన్నై లో కూడ ఉంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 97,800 ఉంది. ఇదే ధర కోల్ కతా, బెంగుళూరు లో కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




