AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani: ఈ ఏడాది శనీశ్వర జయంతి ఎప్పుడు? పూజా విధానం, చేయాల్సిన దానాలు ఏమిటంటే..

హిందూ పంచాంగం ప్రకారం న్యాయ దేవుడు, కర్మ ఫలదాత శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈసారి శనిశ్వర జయంతి జరుపుకునే విషయంలో కొంత గందరగోళం ఉంది. కనుక ఈ ఏడాది శనీశ్వరుడు ఎప్పుడు జరుపుకోవాలి? పూజా పద్దతి గురించి తెలుసుకుందాం..

Lord Shani: ఈ ఏడాది శనీశ్వర జయంతి ఎప్పుడు? పూజా విధానం, చేయాల్సిన దానాలు ఏమిటంటే..
Shani Jayanti 2025
Surya Kala
|

Updated on: May 15, 2025 | 9:40 AM

Share

హిందూ మత విశ్వాసం ప్రకారం ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు, ఛాయా దేవి దంపతుల కుమారుడు శనీశ్వరుడు. వైశాఖ మాసం అమావాస్య రోజున జన్మించాడు. శనీశ్వరుడి జన్మదినోత్సవం రోజున శని దేవుడిని సరిగ్గా పూజించడం ద్వారా సంతోషపెట్టవచ్చు. ఈ రోజున ప్రధానంగా శని మహారాజును పూజిస్తారు. ఆయన అనుగ్రహంతో అన్ని రకాల వ్యాధులు, అప్పుల నుంచి ఉపశమనం పొందుతాడు. ఈ రోజున దానధర్మాలు చేయడం ద్వారా.. జీవితంలో ఆనందం,శ్రేయస్సు పెరుగుతాయి.

శనిశ్వరుడి జయంతి 2025 ఎప్పుడంటే

హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిధి మే 26న మధ్యాహ్నం 12:11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు అంటే మే 27న రాత్రి 8:31 గంటలకు ముగుస్తుంది. కనుక శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని మే 27వ తేదీ మంగళవారం జరుపుకోనున్నారు.

శని జయంతి పూజా విధానం ఏమిటంటే

శనీశ్వరుడి జన్మదినోత్సవం రోజున పూజ చేయడానికి ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. దీని తరువాత శనీశ్వరుడిని నల్లటి వస్త్రంపై ప్రతిష్టించండి. తర్వాత దేవుడి ముందు ఆవ నూనె దీపం వెలిగించండి. పంచగవ్యం, పంచామృతం మొదలైన వాటితో స్నానం చేసిన తర్వాత కుంకుమ పెట్టండి. తరువాత పువ్వులు సమర్పించి, నూనెతో చేసిన స్వీట్లను ప్రసాదంగా సమర్పించండి. తరువాత జపమాల తీసుకుని శని మంత్రాన్ని జపించండి. ఓం ప్రమ్ ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః అనే పంచోపచార మంత్రాన్ని జపించడం కూడా శుభప్రదం. దీని తరువాత శని చాలీసా పారాయణం చేసి, శని దేవుడికి హారతి ఇవ్వండి. చివరగా పూజ సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ అడగండి. శనిశ్వరుడి ఆశీర్వాదం పొందండి.

ఇవి కూడా చదవండి

చేయాల్సిన దానాలు

ఈ రోజున శనిశ్వరుడి అనుగ్రహం కోసం నల్ల నువ్వులు, నూనె, నల్లని వస్త్రాలు, ఇనుప వస్తువులు, బూట్లు దానం, మినపప్పు, దుప్పట్లు దానం చేయడం మంచిది. అంతేకాదు పేదవారికి అన్న వితరణ చేయడం శుభప్రదం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు