Viral Video: ఎవడ్రా వీడు.! కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం చేయిస్తున్న వ్యక్తి.. ధైర్యముంటేనే చూడండి
నీటిలో ఈదుకుంటూ వెళ్తున్న పాములను చాలాసార్లు చూసి ఉండవచ్చు.. కానీ ఎప్పుడైనా పాములకు మనుషులు స్నానం చేయించడం చూశారా.. ఇలాంటి వీడియో ఒకటి మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒక పెద్ద కింగ్ కోబ్రాను రుద్ది రుద్ది మరీ స్నానం చేయిస్తున్నాడు. ఇటువంటి వింత విన్యాసాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

పాము స్నానం చేయడం.. కానీ పాముకి పెంపుడు జంతువులా స్నానం చేయించడం ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఒక వ్యక్తి ప్రమాదకరమైన నాగుపాముకు స్నానం చేయిస్తున్నాడు. ఈ వీడియోలో ఒక వ్యక్తి పెద్ద పాముకు షాంపూ రాసి స్నానం చేయిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. ఇది @AMAZlNGNATURE అనే ID తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.
ఈ షాకింగ్ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన చర్య అంటూ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి పామును ఏదో పెంపుడు కుక్కనో పిల్లినో పట్టుకున్నట్లు పట్టుకుని .. పాముకి స్వయంగా తన చేతులతో షాంపు అప్లై చేశాడు. తరువాత పాముకి నీటితో కడుగుతున్నాడు. అసలు ఇలాంటి పాము కి స్నానం అన్నదే ఎవరి ఊహకు అందనిది.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి తెల్లటి షాంపూ బాటిల్‌ను పట్టుకుని పాము స్నానం చేయించడానికి ప్రయత్నిస్తుంటే.. ఆ పాము మొదట స్నానం చేయకుండా ఉండటానికి ప్రయత్నించింది. అయినా సరే పాముకి షాంపు రాస్తుంటే.. అదేదో చంటి పిల్ల భుజానికి ఎక్కినట్లు.. అతని భుజం మీదకు పాకింది.. అయినా సరే ఆ పాముకి స్నానం చేయించాడు.\
వీడియో ఇక్కడ చూడండి..
Why? Just why? 😳 pic.twitter.com/2T6F4UE79l
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) September 17, 2025
ఈ వీడియో సోషల్ మీడియా నెటిజన్లను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చాలామంది ఆ వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు ఇలాంటి చర్యలు ప్రమాదకరమని అన్నారు. ఒక వినియోగదారు సరదాగా “పాములను కూడా శుభ్రం చేయాలి. మీరు మీ పామును శుభ్రం చేయరా?” అని అడిగాడు, మరొకరు పాముకి “షాంపూ మర్దన ” అని రాశాడు. మరొకరు దీనిని భయానకంగా అభివర్ణించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




