- Telugu News Photo Gallery Boost Immunity Naturally : These 5 Fruits Higher in Vitamin C Than Oranges
Vitamin C: నారింజ కంటే రోగనిరోధక శక్తిని రాకెట్ లా పెంచే సూపర్ ఫ్రూట్స్ ఇవే.. రోజు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
శరీరానికి కావలసిన పోషకాల్లో విటమిన్ సి కి ప్రత్యేక స్థానం ఉంది. విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీంతో తినే ఆహారంలో విటమిన్ సి ఉండేలా చూసుకుంటారు. అయితే విటమిన్ సి అనగానే ముందుగా సిట్రస్ పండ్లు అయిన నిమ్మ, నారింజ గురించే ఆలోచిస్తారు. అయితే నిమ్మ, నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి కలిగి ఉన్న అనేక ఇతర పండ్లు ఉన్నాయని మీకు తెలుసా? ఈ పండ్లు మీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. ఈ 5 సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
Updated on: Sep 19, 2025 | 1:26 PM

శరీరానికి కావాల్సిన విటమిన్ సి నిమ్మ, నారింజలలో ఎక్కువగా ఉంటుందని చాలా మంది నమ్మకం. చాలా సంవత్సరాలుగా నారింజ పండ్లు విటమిన్ సికి పవర్ హౌస్ అని చెబుతున్నారు. అయితే నారింజ కంటే కొన్ని రకాల పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుందని మీకు తెలుసా.. అవును ఈ పండ్లు అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాదు నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి కూడా కలిగి ఉంటాయి. ఈ రోజు రోగనిరోధక శక్తిని రాకెట్ లాగా పెంచే ఐదు సూపర్ పండ్ల (అత్యధిక విటమిన్ సి ఉన్న పండ్లు) గురించి తెలుసుకుందాం.

లిచీ: ఈ తీపి, జ్యుసి పండు వేసవి పండులో లభిస్తుంది. దీనిలో కూడా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. కేవలం 100 గ్రాముల లీచీలో దాదాపు 72 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. లీచీ తినడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది.

స్ట్రాబెర్రీ: ఎరుపు, జ్యుసి స్ట్రాబెర్రీలు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఒక వరం. ఒక కప్పు స్ట్రాబెర్రీలో దాదాపు 85 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌తో పోరాడటానికి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

కివి: ఈ చిన్న గోధుమ రంగు పండు.. లోపల ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. కివీ కూడా విటమిన్ సి నిజమైన నిధి. ఒక కివిఫ్రూట్‌లో దాదాపు 64 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. కివిఫ్రూట్ తినడం వల్ల జలుబును నివారించవచ్చు, నిద్ర లేమి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

బొప్పాయి: బొప్పాయి తినడం కడుపుకు ప్రయోజనకరంగా భావిస్తారు. అయితే ఈ విటమిన్ సి అద్భుతమైన మూలం. కేవలం ఒక కప్పు బొప్పాయిలో 90 మి.గ్రా కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

అనాస పండు: పైనాపిల్ అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాదు ఈ జ్యూసీ పండులో అధికంగా విటమిన్ సి కూడా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్‌లో దాదాపు 79 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. ఇది నారింజ కంటే ఎక్కువ. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది.




