- Telugu News Photo Gallery Cinema photos Actress adah sharma shared her latest beautiful photos on instagram
అదా శర్మ అదరగొట్టేసిందిగా..! ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కానీ ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు ఈ ముద్దుగుమ్మలు. మరికొంతమంది టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు.
Updated on: Sep 19, 2025 | 1:45 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కానీ ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు ఈ ముద్దుగుమ్మలు. మరికొంతమంది టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు.

అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ అదాశర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. మొదటి సినిమాలోనే తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది.ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది

ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ లేడీ ఓరియేంటేడ్ సినిమాలతో పాపులర్ అయ్యింది ఈ భామ. అదా శర్మ నటించిన కేరళ స్టోరీ సినిమా భారీ హిట్ గా నిలిచింది. అలాగే అక్కడ పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఈ వయ్యారి భామ.

చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంది. డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ లో శిక్షణ తీసుకుంది. అందుకే నీళ్లు తాగినంత ఈజీగా సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తోంది. ఆ మధ్యన వచ్చిన బస్తర్: ది నక్సల్ స్టోరీ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లో అదా శర్మ నటనకు అందరూ ఫిదా అయ్యారు.

సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు వదులుతుంది. ఓ వైపు అందాలు ఆరబోస్తూనే మరో వైపు క్రేజీ పిక్స్ షేర్ చేస్తుంది ఈ అమ్మడు. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. పద్దతిగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.




