- Telugu News Photo Gallery Cinema photos Do You Know Rashi Played Daughter and Heroine role With This Hero, He Is Rajashekar
Actress Rashi: ఆ హీరోకు కూతురిగా, ప్రియురాలిగా నటించిన రాశి.. ఎవరంటే..
ఒకప్పుడు తెలుగులో ఆమె టాప్ హీరోయిన్. వరుసగా అనేక చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. తెలుగులో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది.
Updated on: Sep 18, 2025 | 10:01 PM

రాశి.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించి ఫ్యామిలీ సినీప్రియులకు దగ్గరైంది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన రాశి.. ఆతర్వాత కథానాయికగా రాణించింది.

1988లో విడుదలైన రావుగారి ఇల్లు సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసిది. అప్పుడు ఆమె వయసు 9 సంవత్సరాలే. కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన రాశి.. శుభాకాంక్షలు సినిమాతో కథానాయికగా మారింది.

ఆ తర్వాత గోకులంలో సీత సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలో అందం, అభినయంతో కట్టిపడేసింది. ట్రెడిషనల్ , ఇటు గ్లామర్ బ్యూటీగా రాణించింది.

పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న రాశి.. ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తుంది. ఇదెలా ఉంటే ఓ స్టార్ హీరోకు కూతురిగా నటించిన రాశి.. ఆ తర్వాత అదే హీరోకు ప్రియురాలిగా కనిపించింది.

1989లో వచ్చిన మమతల కోవెల చిత్రంలో హీరో రాజశేఖర్ కూతురిగా కనిపించింది. అప్పుడు ఆమె వయసు కేవలం పదేళ్లు మాత్రమే. ఆ తర్వాత సరిగ్గా పదేళ్లకు 1999లో రాజశేఖర్ సరసన నటించింది.




