- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress shanvi srivastava latest glamorous photoshoot goes viral
దుమ్మురేపిన అందాల భామ.. శాన్వీ శ్రీవాస్తవ లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
ఈ బ్యూటీ చేసింది తెలుగులో నాలుగు సినిమాలే.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కొన్ని సినిమాల్లో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కానీ చేసిన సినిమాల్లో మొదటి సినిమా తప్ప మిగిలినవి అన్ని ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆమె తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది.
Updated on: Sep 19, 2025 | 1:53 PM

ఈ బ్యూటీ చేసింది తెలుగులో నాలుగు సినిమాలే.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కొన్ని సినిమాల్లో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కానీ చేసిన సినిమాల్లో మొదటి సినిమా తప్ప మిగిలినవి అన్ని ఫ్లాప్ అయ్యాయి.

దాంతో ఆమె తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఇంతరభాషల్లో సినిమాలు చేస్తుంది. కానీ అక్కడ కూడా స్టార్ గా ఎదగలేకపోయింది. లవ్లీ సినిమా గుర్తుందా.? ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు బీఏ జయ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శాన్వీ శ్రీవాస్తవ.

తొలి సినిమాతోనే తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది. ఆతర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. సుశాంత్ అడ్డా, మంచు విష్ణు రౌడీ, మరోసారి ఆదితో ప్యార్ మే పడిపోయానే సినిమాల్లో నటించింది. కానీ అవేమి వర్కౌట్ కాలేదు. దాంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ కాస్త పర్లేదు అనిపించుకుంది.

ఆ మధ్య అతడే శ్రీమన్నారాయణ డబ్బింగ్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సమయంలో శాన్వీ మాట్లాడుతూ తెలుగులో అవకాశాలు రావడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఎందుకు ఛాన్స్ లు రాలేదో అర్ధం కావడం లేదు అని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఇప్పుడు కన్నడలోనే సినిమాలు చేస్తుంది. అక్కడ కూడా ప్రస్తుతం శాన్వీ శ్రీవాస్తవకు చెప్పుకోదగ్గ సినిమాలు రావడం లేదు. సోషల్ మీడియాతోనే ఈ చిన్నది కాలం గడిపేస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.




