Tirumala: తిరుమలలో సాదాసీదాగా అప్పటి స్టార్ హీరోయిన్.. ఒక్కరే గుర్తుపట్టారు భయ్యా..!
ఆమె ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్. ఎన్నో మంచి సినిమాలు చేసింది. ఇప్పటికీ ఆమె పేరు ఓ బ్రాండ్. తెలుగులో మాత్రమే కాదు.. సౌత్ భాషలు అన్నింటిలో మంచి సినిమాలు చేసింది. తాజాగా శుక్రవారం సామాన్య భక్తురాలిలా శ్రీవారి సేవలో పాల్గొంది.

ఈమెను గుర్తుపట్టారా భయ్యా..! తిరుమలలో సాదాసీదాగా కనిపించింది. చాలామంది ఆమెను గుర్తుపట్టలేదు కూడా. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అగ్రహీరోల సరసన నటించింది. తను మరెవరో కాదు అలనాటి హీరోయిన్ ప్రేమ. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం.. తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. ఆమె సాధారణ భక్తురాలి వలె నడుచుకుంటూ తిరుమల మాడ వీధుల్లో తిరిగారు. ఒకరిద్దరు భక్తులే ప్రేమను గుర్తుపట్టారు.
కాగా ప్రేమ వెంకటేష్ హీరోగా సురేశ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధర్మచక్రం’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రేమ నటించిన దేవి సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ప్రేమ.. తన వైవాహిక జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంది. 2006లో జీవన్ అప్పచ్చును లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రేమ.. పదేళ్ల తర్వాత అతని నుంచి విడాకులు తీసుకుంది. వివాహం తర్వాత తనకు స్వేచ్ఛ దొరకలేదని.. భర్త విషయంలో అంచనాలు తప్పడంతో.. విడిపోయినట్లు వెల్లడించింది.
View this post on Instagram




