అదిరిపోయే లుక్‌లో అనుపమా..బ్యూటిఫుల్ ఫొటోస్!
అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింపుల్‌గా కనిపిస్తూనే కుర్రకారు మనసుదోచేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు చుఢీదార్‌లో తన అంద చందాలతో మతి పొగొడుతుంది. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
Updated on: Sep 19, 2025 | 2:32 PM

అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింపుల్‌గా కనిపిస్తూనే కుర్రకారు మనసుదోచేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు చుఢీదార్‌లో తన అంద చందాలతో మతి పొగొడుతుంది. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అందులో ఒకటి డిజాస్టర్ అయినా మరో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీ కెరీర్ మరింత ఫామ్‌లోకి వచ్చిందనే చెప్పాలి.

ప్రేమమ్ మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైన చిన్నది అనుపమ పరమేశ్వరన్, ఈ అమ్మడు మొదటి సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. దీంతో వరసగా ఆఫర్స్ అందుకుంటూ, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా తన సత్తా చాటుతుంది.

రీసెంట్‌గా పరదా మూవీతో తెలుగు అభిమానులను పలకరించింది ఈ బ్యూటీ కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కానీ కిష్కిందపురి సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకొంది. ఈ అమ్మడు డీజే టిల్లు స్క్వేర్ మూవీతో మంచి ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ మూవీలో ఈ అమ్మడు గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.దీంతో ఈ మూవీ తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంటూ బ్లాక్ బస్టర్స్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది. సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ చిన్నది తాజాగా చుఢీదార్‌లో తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తుంది