Allu Arjun: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న బన్నీ
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. మంగళవారం (అక్టోబర్ 17) ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్. తద్వారా 69 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న మొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. మంగళవారం (అక్టోబర్ 17) ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్. తద్వారా 69 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న మొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. దీంతో ఈ స్టైలిష్ హీరోకు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బన్నీకి కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ వెంట అతని సతీమణి స్నేహలతా రెడ్డి కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ద్రౌపది ముర్ముతో పాటు పలువురు కేంద్రమంత్రలు పాల్గొన్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు గానూ ఈ అవార్డు అందుకున్నారు బన్నీ. ఎర్రచందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా లో పుష్పరాజ్ గా కనిపించాడు అల్లు అర్జున్. నేషనల్ క్రష్ రష్మిక మంధన్నా హీరోయిన్ గా నటించింది. అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సమంత ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా డైలాగులు, పాటలు రీక్రియేట్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఈ సినిమాకు గుర్తింపు వచ్చిందంటే దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కూడా ఒక కారణమే. అందుకే జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇదే సినిమాకు అవార్డు అందుకున్నాడు దేవిశ్రీ. ఇక పుష్ప కలెక్షన్ల విషయానికొస్తే.. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ ఊర మాస్ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్
ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. చిరంజీవి నటించిన డాడీ వంటి సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు అల్లు అర్జున్. ఆ తర్వాత గంగోత్రి సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సుకుమార్ ఆర్య సినిమాతో మొదటి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. బన్నీ, హ్యాపీ, దేశ ముదురు, పరుగు, ఆర్య2, వరుడు, వేదం, బద్రీనాథ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, ఎవడు, రేస్ గుర్రం, సన్నాప్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, డీజే సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అలా వైకుంఠ పురం సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు. ఆ వెంటనే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. త్వరలోనే తన రికార్డులు బద్దలు కొట్టడానికి తానే పుష్ఫ2.. ది రూల్ మూవీతో మన ముందుకు రానున్నాడు.
జాతీయ అవార్డుల ప్రదానోత్సవం .. లైవ్ వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.