Jana Nayagan : ఆయనకు గొప్ప వీడ్కొలు దక్కాలనుకన్నా.. మమ్మల్ని క్షమించండి.. విజయ్ నిర్మాత ఆవేదన..
కొన్ని రోజులుగా వార్తలలో వినిపిస్తున్న పేరు జన నాయగన్. కోలీవుడ్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న చివరి సినిమా ఇది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కావాల్సిన ఈ మూవీ.. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు.

కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన సినిమా జన నాయగన్. ఇటీవలే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన విజయ్ చివరి సినిమా ఇదే. దీంతో ముందు నుంచే ఈ ప్రాజెక్ట్ పై భారీ ఆసక్తి నెలకొంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మమితా బైజు, పూజా హెగ్డే, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ సంబంధిత సమస్యల కారణంగా ఈ సినిమా విడుదల కాలేదు. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా పడడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సినిమాకు సంబంధఇంచిన కేసును విచారించిన కోర్టు కేసు విచారణను జనవరి 21, 2026కి వాయిదా వేసింది. దీంతో ఇప్పట్లో ఈ సినిమా విడుదల కావడం కష్టంగా మారింది. ఈ చర్యను చిత్రపరిశ్రమ తీవ్రంగా ఖండిస్తోంది.
తాజాగా ఈ మూవీ నిర్మాత వెంకట్ నారాయణన్ జన నాయగన్ వాయిదా పడడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. గత కొన్ని రోజులుగా వివిధ కాల్స్ సందేశాలు వస్తున్నాయి. అభిమానులు సినిమాపై కలిగి ఉన్న ప్రేమను అవి చూపిస్తున్నాయి.. ప్రస్తుతం, ఈ విషయం కోర్టులో ఉన్నందున, కొన్ని విషయాలను పూర్తిగా వెల్లడించలేము. ఈ చిత్రాన్ని డిసెంబర్ 18, 2025న సెన్సార్ బోర్డుకు సమర్పించారు.డిసెంబర్ 22న కొన్ని మార్పులు చేయాలని మాకు సలహా ఇచ్చారు. ఆ తర్వాత, UA 16+ సర్టిఫికేట్ వస్తుందని మాకు మెయిల్ రావడంతో.. సెన్సార్ బోర్డు సూచించిన అన్ని మార్పులను చేసి, సినిమాను తిరిగి సమర్పించాము. అయితే, సర్టిఫికేట్ ఆశించిన విధంగా రాలేదు. అందుకే మా వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం.
సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు, జనవరి 5, 2026 సాయంత్రం, ఎవరో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా సినిమాను సమీక్ష కమిటీకి పంపినట్లు వార్తలు వచ్చాయి. ఫిర్యాదు ఎవరు దాఖలు చేశారో తెలియకపోవడంతో, హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.జనవరి 6, 7, 2026 తేదీలలో జరిగిన విచారణ తర్వాత, కోర్టు UA 16+ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది, కానీ సెన్సార్ బోర్డు అప్పీల్ కారణంగా ఆ ఉత్తర్వు తాత్కాలికంగా నిలిపివేయబడింది. సినిమా విడుదలలో జాప్యం జరిగినందుకు అభిమానులు, పంపిణీదారులు, థియేటర్ యజమానులు సహా అందరికీ నేను క్షమాపణలు కోరుతున్నాను. సినిమా త్వరలోనే ప్రణాళిక ప్రకారం విడుదల అవుతుందని అన్నారు. దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో ప్రేక్షకులను అలరించిన విజయ్ కు గొప్ప వీడ్కొలు దక్కాలని కోరుకుంటున్నాను. కానీ మా పరిస్థితి చేయి దాటిపోయింది అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
