Vamshika Yadav: వెల్లివిరిసిన భక్తి.. 450 కి.మీ స్కేటింగ్ చేస్తూ అయోద్యకు చేరిన 9 ఏళ్ల బాలిక
అసలే చలికాలం.. అగుడుబయట పెట్టాలంటేనే జనాలు వణికిపోతున్నారు. కానీ ఓ తొమ్మదేళ్ల బాలిక మాత్రం యముకలు కొరికే చలిని సైత్యం లెక్కచేయకుండా తన భక్తిని చాటుకుంది. ఏకంగా 450 కిలో మీటర్లు స్కేటింగ్ చేస్తూ ఆయోద చేరుకొని తన ఆరాధ్య దైవమైన బాలరాముడిని దర్శించుకుంది. ఆ బాలిక భక్తికి మెచ్చిన జనాలు అదరహో అంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలిక శ్రీరాముడిపై తనకున్న భక్తిని వినూత్నం రూపంలో చాటిచెప్పింది. అయోద్యలోని బాలరాముడిని దర్శించుకునేందుకు ఏకంగా ఫిరోజాబాద్ నుండి అయోధ్య వరకు 450 కిలోమీటర్లు స్కేటింగ్ చేస్తూ వెళ్లింది. ఆ శ్రీరాముడి పట్ల బాలికకు ఉన్న భక్తిపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన జనాలు బాలిక భక్తిని మెచ్చుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా్కు చెందిన శివశంకర్ యాదవ్ కుమార్తె తొమ్మిదేళ్ల వంశిక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమెకు శ్రీరాముడిపై ఉన్న భక్తితో స్కేటింగ్ చేస్తూ వెళ్లి అయోద్యలోని బాలరాముడిని దర్శించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే జనవరి 3న తన ఫిరోజాబాద్ నుంచి తన యాత్రను ప్రారంభించింది. ఐదు రోజుల పాటు సుమారు 450 కిలో మీటర్ల దూరం స్కేటింగ్ చేస్తూ వంశిక అయోద్యకు చేరుకుంది. ఎన్ని అడ్డకుంటు వచ్చానా ఆమె తన సంకల్పాన్ని కోల్పోలేదు.. బలంగా నిలబడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. చివరకు తన ఆరాధ దైవమైన శ్రీరాముడిని దర్శించుకుంది. ఈ సందర్భంగా వంశికా యాదవ్ మాట్లాడుతూ రాముడిపై తనకున్న భక్తి, దృఢ సంకల్పమే తనను ఈ దిశగా నడిపించాయని చెప్పుకొచ్చింది.
అయితే వంశిక స్కేటింగ్ చేస్తుండగా ఆమె ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఆమె తండ్రి, మామయ్య కార్లో తనను ఫాలో అయ్యారు. వంశియ యాత్ర మధ్యలో విరామం తీసుకొని రోడ్డు పక్కన ఉన్న మైలురాళ్లపై ఉన్న ధూళిని, పిచ్చి మొక్కలను క్లీన్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఆమె భక్తితో పాటు సమాజం పట్ల తనకున్న సామాజిక బాధ్యతను కూడా చూపించింది.
అయితే యముకలు కొరికే చలిలో 450 కిలోమీటర్లు స్కేటింగ్ చేస్తూ ఆయోద్యకు చేరుకున్న వంశికాకు స్వాగతం పలికిన రామ మందిర ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా. వంశిక భక్తిని ప్రశంసించారు. బలమైన సంకల్పం ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈజీగా అధిగమించవచ్చని వంశికా దేవానికి చాటిచెప్పిందని ఆయన అన్నారు.
వీడయో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
