Maoists Surrender: మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన 63 మంది నక్సలైట్స్!
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బతగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎత్తున్న మావోయిస్టులు లొంగిపోయారు. సుమారు 63 మంది మావోయిస్టులు దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట శుక్రవారం సరెండర్ అయ్యారు. తాజాగా లొండిపోయిన వారిపై సుమారు 1.19కోట్ల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బతగిలింది. ఛత్తీస్‌గడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో సుమారు 63 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. లొంగిపోయిన వారిలో దంతేవాడ, సుక్మా, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాలకు చెందిన డివిజనల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, మిలీషియా ప్లాటూన్ కమాండర్లు ఉన్నారు. ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులపై రూ.1.19కోట్ల రివార్డు ఉన్నట్లు జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు.
ప్రస్తుతం దర్భా డివిజన్, సౌత్ బస్తర్, వెస్ట్ బస్తర్, మార్ ప్రాంతం, ఒడిశాలోని పరిసర ప్రాంతాలలో క్యాడర్లు చురుకుగా ఉన్నారని దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. ఏడుగురు కేడర్లకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డు ప్రకటించగా, వారిని ప్రదీప్ ఓయం, మోహన్ ఆజాద్ కడ్తి, సుమిత్ర చాపా, హంగి లేకం, సుఖ్‌రామ్ తాటి, పాండు మద్కం, సోమ్దు కడ్తిగా గుర్తించారు. మరో ఏడుగురికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల రివార్డు, ఎనిమిది మందికి రూ.2 లక్షలు, 11 మందికి రూ.1 లక్ష, ముగ్గురికి రూ.50,000 రివార్డు ప్రకటించగా, మొత్తం రూ.1.2 కోట్లు అందాయని రాయ్ చెప్పారు.
రాష్ట్రంలో మావోయిస్ట్‌లు లేకుండా చేయాలనే లక్ష్యంగా చత్తీస్‌గడ్ ప్రభుత్వం ‘లోన్ వర్రాటు అనే పునరావాస కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే మావోయిస్టులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.తమ కాలం చెల్లిన సింద్ధాంతాలను వదిలి పెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులు పోలీసుల ఎదుటకు వచ్చి లొంగిపోతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
