Vaa Vathiyaar : జన నాయగన్ సినిమా వాయిదా.. సంక్రాంతి రేసులోకి మరో స్టార్ హీరో..
కోలీవుడ్ హీరోలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తమిళంలో విడుదలైన సినిమాలను తెలుగులోకి డబ్ చేయగా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు సంక్రాంతి రేసులోకి తెలుగు హీరోలతోపాటు... అటు తమిళ హీరోలు సైతం రెడీ అయ్యారు. తెలుగులోనూ తమ సినిమాలను సైతం రిలీజ్ చేయనున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇమేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్.. ఇటు సినిమాలకు రిటర్టైన్మెంట్ సైతం ప్రకటించారు. ఆయన చివరగా నటిస్తున్న సినిమా జన నాయగన్. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇదెలా ఉంటే.. ఇప్పుడు తమిళంలో సంక్రాంతి రేసులో కేవలం పరా శక్తి సినిమా మాత్రమే ఉంది. ఈక్రమంలోనే తాజాగా మరో స్టార్ హీరో పొంగల్ రేసులోకి వచ్చేశారు. అతడు మరెవరో కాదు.. హీరో కార్తీ.. తమిళంతోపాటు తెలుగులోనూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో కార్తీ. విభిన్న కథలు.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యుగానికి ఒక్కడు, ఆవారా, ఖైదీ, ఖాకీ, సర్దార్ , ఊపిరి వంటి సినిమాలతో టాలీవుడ్ లో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఈ హీరో నటిస్తున్న లేటేస్ట్ మూవీ వా వాతియార్.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
సత్యం సుందరం వంటి సూపర్ హిట్ తర్వాత కార్తీ నటిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అడియన్స్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. డైరెక్టర్ నలన్ కుమార్ స్వామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో హీరోయిన్ కృతి శెట్టి నటించింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా.. ఇప్పుడు సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈమూవీ ప్రస్తుతం తమిళంలో మాత్రమే రిలీజ్ చేయనున్నారు. తెలుగు వెర్షన్‌ను కొంత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
నిజానికి ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సింది. కానీ చివరి నిమిషంలో ఈ మూవీ ఫైనాన్స్ కు సంబంధించిన సమస్యలు వచ్చాయి. నిర్మాత చెల్లించాల్సిన కొన్ని బాకీలు క్లియర్ చేయకపోవడంతో కోర్టు జోక్యం చేసుకుంది. సంబంధిత మొత్తాన్ని చెల్లించిన తర్వాతే ఈ సినిమాను విడుదల చేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఫైనాన్స్ సమస్యలు క్లియర్ కావడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.
#VaaVaathiyaar – Jan 14th ! pic.twitter.com/2sfpXDlUQp
— Prashanth Rangaswamy (@itisprashanth) January 9, 2026
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..




