AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: చిన్నారి అభిమానిని ప్రేమగా పలకరించిన అల్లు అర్జున్.. దగ్గరుండి మరీ ఆటోగ్రాఫ్ ఇచ్చిన బన్నీ..

అనంతరం కాసేపు ముచ్చటించి ఆ చిన్నారి పేరు, వివరాలు అడిగి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాలోని పుష్పరాజ్ నటనకుగానూ బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకోనున్నారు. మరికాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డ్ అందుకోనున్నారు.

Allu Arjun: చిన్నారి అభిమానిని ప్రేమగా పలకరించిన అల్లు అర్జున్.. దగ్గరుండి మరీ ఆటోగ్రాఫ్ ఇచ్చిన బన్నీ..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Oct 17, 2023 | 3:51 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఢిల్లీలో సందడి చేస్తున్నారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ వేడుకలలో పాల్గొనేందుకు తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఓ చిన్నారి అభిమాని వీల్ చైర్‏లో బన్నీని చూసేందుకు వచ్చారు. ఆ చిన్నారిని చూడగానే బన్నీ చలించిపోయారు. ఆ చిన్నారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం కాసేపు ముచ్చటించి ఆ చిన్నారి పేరు, వివరాలు అడిగి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాలోని పుష్పరాజ్ నటనకుగానూ బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకోనున్నారు. మరికాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డ్ అందుకోనున్నారు.

పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటనకు భారతీయులతోపాటు.. విదేశీయులు సైతం ముగ్దులయ్యారు. దీంతో ఐకాన్ స్టార్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రంలో బన్నీ స్టైల్, యాటిట్యూడ్ అందరినీ ఆకర్షించింది. ముఖ్యంగా తగ్గేదే లే అనే డైలాగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. బన్నీ ఎక్కడ కనిపించినా ఇప్పుడు ఫ్యాన్స్ సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడుతుంటారు. చాలా సందర్భాల్లో తన అభిమానులతో ఎంతో సరదాగా ఉంటారు బన్నీ. అలాగే వారికి ఆటోగ్రాఫ్స్ కూడా ఇస్తుంటారు. ఇక ఇప్పుడు చిన్నారి అభిమానికి ప్రేమతో పలకరించి.. అడగ్గానే ఆటోగ్రాఫ్ ఇవ్వడం చూసి మరోసారి బన్నీపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్‌తో పాటు ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ కార్తికేయ కూడా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే జాతీయ అవార్డుల వేడుకకు హాజరయ్యారు. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీ ఉన్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. అలాగే సందీప్ వంగా డైరెక్షన్ లో బన్నీ ఓ సినిమా చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే