ఎంతో అవమానించారు.. చెట్టు చాటున బట్టలు మార్చుకోమన్నారు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
కాస్టింగ్ కౌచ్.. సినీరంగాన్ని పట్టిపీడిస్తోన్న సమస్య. ఇప్పటికే ఎంతో మంది తారుల ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను..కఠిన పరిస్థితుల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా సినిమాల్లో తొలి అవకాశం కోసం ఎదురుచూస్తున్న చాలా మంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొన్నవారే.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొన్ని సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీకి షాక్ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. కొంతమంది తమకు ఎదురైనా లైంగిక వేధింపుల గురించి మీడియా ముందు దైర్యంగా మాట్లాడారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా చాలా మంది పై పలువురు నటీమణులు ఆరోపణలు చేశారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ కూడా సినిమా షూటింగ్ లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయట పెట్టారు. ఓ స్టార్ హీరో సినిమా సెట్ లో తనను చెట్టు చాటున బట్టలు మార్చుకోమన్నారు అని తెలిపింది. ఇంతకూ ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు. 90 దశకంలో కుర్రాళ్ళ మనసు దోచేసిన హీరోయిన్ శోభన. అప్పటిలో శోభన తన అభినయంతో కట్టిపడేసింది. ప్రస్తుతం శోభన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే తుడరమ్ సినిమాతో మంచి మంచి హిట్ అందుకున్నారు శోభన. ఈ సీనియర్ హీరోయిన్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది. ఓ సినిమా సెట్ లో తనను చెట్టుచాటున బట్టలు మార్చుకోమన్నారు అని తెలిపింది.
శోభన హిందీలోనూ సినిమాలు చేశారు. అమితాబ్ బచ్చన్ హీరోగా ఆ సినిమా తెరకెక్కింది. ఆ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. సాంగ్ షూట్ సమయంలో బట్టలు మార్చుకోవడానికి కార్ వాన్ ఇవ్వమంటే చెట్టుచాటుకెళ్ళి మార్చుకోమన్నారు. ఎంతో అవమానించారు. తనను చులకనగా మాట్లాడారు అంటూ ఎమోషనల్ అయ్యింది శోభన. అయితే ఈ విషయం తెలియగానే అమితాబ్ బచ్చన్ గొప్పమనసుతో తన కార్ వాన్ ను ఇచ్చారు అని తెలిపింది శోభన. ఆ సమయంలో ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పినట్లు తెలిపింది శోభన.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.