Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫస్ట్ సినిమా అట్టర్ ఫ్లాప్.. కట్ చేస్తే పెద్ద హీరోలంతా ఆమె హీరోయిన్‌గా కావాలంటున్నారు.. ఇంతకూ ఎవరంటే..

తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్ అన్ని చెప్పవచ్చు. తన అందం, అభినయంతో తెలుగునాట జెట్ స్పీడ్ లో దూసుకెళుతోందీ అందాల తార. ఆ మధ్యన కాస్త డల్ అయినా మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైందీ క్రేజీ బ్యూటీ. తెలుగులో బడా హీరోల సినిమాల్లో బిజీగా మారిపోయింది . మరీ ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా?

ఫస్ట్ సినిమా అట్టర్ ఫ్లాప్.. కట్ చేస్తే పెద్ద హీరోలంతా ఆమె హీరోయిన్‌గా కావాలంటున్నారు.. ఇంతకూ ఎవరంటే..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 08, 2025 | 9:36 AM

చాలామంది హీరోయిన్లలాగే ఈ ముద్దుగుమ్మ కూడా మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకుంది. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. ముఖ్యంగా క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో ఈ ముద్దుగుమ్మ బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. మొదటి సినిమాలోనే తన అందం, అభినయంతో యువతను ఆకట్టుకుంది. హిందీలో వరుసగా రెండు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఒక స్టార్ హీరో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ కూడా మంచి సక్సెస్ రేట్ ఉన్నవాడే. కానీ తన తెలుగు డెబ్యూ మూవీ అనూహ్యంగా బోల్తా పడింది. ఈ అమ్మడి అందం, అభినయానికి మంచి పేరొచ్చినా సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తెలుగులో ఈ అందాల తార పని అయిపోయినట్టేనని చాలా మంది భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టాలీవుడ్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 5 క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ఇలా టాలీవుడ్ లో బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతోన్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే.

విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి చేస్తున్న ‘కింగ్ డమ్’లో ముందు శ్రీలీల ఆ తర్వాత రష్మిక మందన్నాని అనుకున్నారు. అయితే చివరకు ఆ ఆఫర్ భాగ్యశ్రీని వరించింది. ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) తెరకె్క్కిస్తోన్న సినిమాలోనూ భాగ్యశ్రీనే హీరోయిన్. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా రానా నిర్మిస్తున్న ‘కాంతా’ లోనూ భాగ్యశ్రీనే కథానాయికగా ఎంపికైందని సమాచారం. అలాగే సూర్య – వెంకీ అట్లూరి కలయికలో రూపొందే సినిమాలోనూ ఈ క్రేజీ హీరోయిన్ ని లాక్ చేశారని తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందీ ముద్దుగుమ్మ. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న బ్రహ్మా రాక్షస్ లోనూ ఈ ముద్దుగుమ్మ నటించనుందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి 5 పాన్ ఇండియా సినిమాలతో బిజి బిజీగా ఉంటోందీ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?