AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఈ టాలీవుడ్ సంచలనాన్ని గుర్తు పట్టారా? 2 నేషనల్ అవార్డులు

ఇతను 2014లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అంటే దాదాపు 12 సంవత్సరాలు అయ్యింది. కానీ ఇప్పటివరకు కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేశాడు. మొదటి రెండు సినిమాలు బాగానే ఆడాయి.ఇక చివరి రెండు సినిమాలు అయితే బ్లాక్ బస్టర్స్. ఈ రెండు సినిమాలకు ఏకంగా రెండు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నాడీ టాలీవుడ్ సంచలనం

Tollywood: ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఈ టాలీవుడ్ సంచలనాన్ని గుర్తు పట్టారా? 2 నేషనల్ అవార్డులు
Tollywood Director
Basha Shek
|

Updated on: Jun 24, 2026 | 5:18 PM

Share

పై ఫొటోలో నిబ్బాలా కనిపిస్తున్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇతను తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. 2014లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడితను. ఈ 12 ఏళ్ల కాలంలో కేవలం నాలుగంటే నాలుగు సినిమాలు మాత్రమే చేశాడు. మొదటి రెండు సినిమాలు కామెడీ ఎంటర్ టైనర్స్. అయినా థియేటర్లలో ఈ సినిమాలు బాగానే ఆడాయి. కానీ ఎందుకోగానీ ఇతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ కరోనా కాలంలో ఒక లవ్ స్టోరీ తీశాడు. థియేటర్ల రిలీజ్ కు సమస్యలు రావడంతో డైరెక్టుగా ఓటీటీలోకి రిలీజ్ చేశాడు. అయితేనేం సినిమా బ్లాక్ బస్టర్. విమర్శకుల ప్రశంసలతో పాటు ఏకంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీని తర్వాత మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీశాడు. ఈ సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా చూసిన ఆడియెన్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయారు. తక్కువ బడ్జెట్ సినిమా అయినా కూడా ఈ మూవీ 80 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దీంతో పాటు అదనంగా మరో జాతీయ అవార్డు వచ్చి ఇతని ఖాతాలో చేరింది. ఇప్పుడు తన విజయ పరంపరను కొనసాగించేందుకు మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతను స్టార్ హీరో ఏమీ కాదు.

ఇవి కూడా చదవండి

రైటర్ గా, నిర్మాతగా, డైరెక్టర్ గా రెండు జాతీయ అవార్డులు అందుకున్న ఈ సంచలనం మరెవరో కాదు సాయి రాజేష్. పేరు చెబితే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ బేబీ సినిమా డైరెక్టర్ అంటే ఇట్టే గుర్తు పడతారు. ఇది అతను టీనేజ్ నాటి ఫొటో. సాయి రాజేష్ నుంచి వస్తోన్న లేటెస్ట్ సినిమా ది చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ఇందులో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్స్, గ్లింప్స్, సాంగ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. రవి నంబూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, సాయి రాజేష్ కథను అందించారు. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై శ్రీనివాస కుమార్ (ఎస్కేఎన్), సాయి రాజేష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

డైరెక్టర్ సాయి రాజేష్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Sai Rajesh (@sairazesh)

ఇక సాయి రాజేష్ విషయానికి వస్తే.. కెరీర్ ప్రారంభంలో సంపూర్ణేశ్ బాబుని హీరోగా పెట్టి ‘హృదయ కాలేయం’ తీశాడు సాయి రాజేష్. ఈ సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఆ తర్వాత మరోసారి సంపూర్ణేశ్ బాబుతోనే ‘కొబ్బరిమట్ట’ అనే సినిమా తీశాడు. ఆ తర్వాత ‘కలర్ ఫొటో’ సినిమాకు స్టోరీ అందించడంతో నిర్మాతగానూ వ్యవహరించాడు. దీని తర్వాత బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో..

View this post on Instagram

A post shared by Sai Rajesh (@sairazesh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..
సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..