Jabardasth Varsha: సొంత అక్కాచెల్లెళ్లే అలా చేసే సరికి తట్టుకోలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ వర్ష
జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది వర్ష. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఆమె చేసిన స్కిట్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ఇప్పుడీ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి కూడా వచ్చే అవకాశాలున్నాయి.

జబర్దస్త్ నటి వర్ష గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు టీవీ సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఈ షోలో ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఆమె చేసిన స్కిట్స్ కు యూట్యూబ్ లో భారీ వ్యూస్ వచ్చాయి. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోల్లో సందడి చేస్తోన్న వర్ష ఓ ప్రముఖ ఛానెల్ టాక్ షోకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది. అలాగే త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోనూ ఈ బ్యూటీ కంటెస్టెంట్ గా వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓ టాక్ షోలో వర్ష బాగా ఎమోషనలైంది. తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది.
‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో నా కుటుంబం నుంచి కూడా నాకు పెద్దగా మద్దతు లభించలేదు. నా సొంత అక్కాచెల్లెలు కూడా నాతో సరిగా మాట్లాడలేదు. ‘నువ్వు మా చెల్లివి అని బయట ఎవరికీ చెప్పొద్దు’ అని నన్ను హెచ్చరించారు. ఆ సమయంలో వారి మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. అయితే వాళ్లను పూర్తిగా తప్పుపట్టలేను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గురించి వారికి ఉన్న అభిప్రాయం అలాంటిది. నా జీవితంలో అసలు మార్పు జబర్దస్త్ తోనే మొదలైంది. ‘జబర్దస్త్‌లో నేను కనిపించిన తర్వాత ఇంట్లోనూ నాకు గౌరవం పెరిగింది. మా ఇంటికి, బంధువులకు చాలా మంది ఫోన్ చేసి నా గురించి మంచిగా చెప్పారు. మీ చెల్లెలు చాలా బాగా చేస్తోందని, షోలో అదరగొడుతోందని ప్రశంసించారు. ఆ తర్వాత మా అక్కాచెల్లెలు కూడా నాకు మళ్లీ దగ్గరయ్యారు. కానీ నాకు అన్ని సమయాల్లోనూ మా అమ్మ అండగా నిలిచారు. ఎప్పుడూ నన్ను ముందుండి ప్రోత్సహించారు’ అని ఎమోషనల్ అయ్యింది వర్ష. ప్రస్తుతం ఈ జబర్దస్త్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




