తన సినిమా రివ్యూ తానే అడిగి తెలుసుకున్న స్టార్ హీరో.. ఆడియన్స్ చెప్పింది విని షాక్..
ఈ మధ్య సినిమాలు విడుదలైతే చాలు థియేటర్స్ ముందు మైకులు పట్టుకొని కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. థియేటర్స్ నుంచి బయటకు రాగానే మైకులు పెట్టి సినిమాల రివ్యూలు అడుగుతూ హడావిడి చేస్తుంటారు. ఇప్పుడు ఓ హీరో ఏకంగా తన సినిమాకు తానే రివ్యూ అడిగి తెలుసుకున్నాడు..

ఆయన ఓ స్టార్ హీరో.. ఇండియాలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరో ఆయన. కానీ ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఏడాది 5 సినిమాలు చేస్తున్నాడు ఆ స్టార్ హీరో. తాజాగా తన సినిమా రివ్యూ తానే అడిగి తెలుసుకున్నాడు. ఈ మధ్యకాలంలో సినిమాల రివ్యూలు చెప్పే వారు ఎక్కువ పాపులర్ అవుతున్నారు. సినిమా విడుదలైతే చాలు థియేటర్స్ ముందు మైకులు పట్టుకొని చాలా మంది రివ్యూలు అంటూ రెడీ అవుతుంటారు. యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ ఛానల్స్ అన్ని కలిపి 20, 30మైకులు పట్టుకొని చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇలా ఓ స్టార్ హీరో ఏకంగా తన సినిమా తానే రివ్యూ అడిగి తెలుసుకున్నాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.?
బాలీవుడ్ లో అత్యధిక ఫ్లాప్స్ అందుకున్న హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ హిట్స్, ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏడాదికి 4, 5 సినిమాలు చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి. తాజాగా అక్షయ్ నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజాగా అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 5 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా రివ్యూ కోసం అక్షయ్ కుమార్ మాస్క్ ధరించి థియేటర్ ముందు రివ్యూస్ అడిగి తెలుసుకున్నాడు. మాస్క్ లో ఉన్న అక్షయ్ కుమార్ ను ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఒకొక్కరి దగ్గరకు వెళ్లి రివ్యూలు అడుగుతూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి