Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘ఇకపై నువ్వు నావాడివి’.. ప్రియుడికి బిగ్‌బాస్‌ తెలుగు బ్యూటీ పెళ్లి ప్రపోజల్‌ .. ఫొటోస్ వైరల్

గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు ఈ లవ్ బర్డ్స్. అంతేకాదు చాలా రోజుల నుంచే కలిసే ఉంటున్నారు. అయితే ఇప్పుడీ ప్రేమ పక్షులు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అయ్యారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వీరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tollywood: 'ఇకపై నువ్వు నావాడివి'.. ప్రియుడికి బిగ్‌బాస్‌ తెలుగు బ్యూటీ పెళ్లి ప్రపోజల్‌ .. ఫొటోస్ వైరల్
Bigg Boss Telugu Actress
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2025 | 1:17 PM

బిగ్‌బాస్‌ బ్యూటీ ప్రియాంక జైన్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడ నాటకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో పలు సీరియల్స్ లో యాక్ట్ చేసింది. అదే గుర్తింపుతో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ అడుగు పెట్టింది. దీంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజి బిజీగా ఉంటోందీ అందాల తార. వీటి సంగతి పక్కన పెడితే ప్రియాంక జైన్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉంది. బుల్లితెర నటుడు శివకుమార్‌తో కలిసి ప్రేమలో మునిగి తేలుతోంది. గత కొంతకాలంగా కలిసే ఉంటోన్న ఈ ప్రేమ పక్షులు ఇప్పుడు అధికారికంగా పెళ్లికి రెడీ అయ్యారని తెలుస్తోంది. శనివారం (జూన్‌ 8న) శివకుమార్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన ప్రియుడితో కలిసి అండమాన్ నికోబార్ పర్యటనకు వెళ్లింది ప్రియాంక. అక్కడ శివ కుమార్ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఇదే సందర్భంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని మోకాలిపై కూర్చుని ప్రపోజల్‌ చేసింది. ఇంకేముంది.. శి్ కూడా ఎగిరి గంతేశాడు. ‘తప్పకుండా’ అంటూ ప్రియురాలిని గట్టిగా హత్తుకున్నాడు. ఈ సందర్భంగా ప్రియాంక శివ్ కుమార్ వేలికి రింగ్ తొడిగి బర్త్ డే విషెస్ చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.

‘ నా కాబోయే జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు అధికారికంగా నువ్వు నావాడివి. ఎప్పటికీ నాతోనే ఉండాలి. మనం జంటగా ఎన్నో సాహసాలు చేద్దాం. ఇక్కడివరకు మన ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. తర్వాత కూడా అంత ఈజీగా ఉండకపోవచ్చు. కానీ మనం ప్రతిరోజు దాన్ని ఉత్తమంగా మార్చుకునేందుకు ప్రయత్నిద్దాం. ఎప్పటికప్పుడు కాలాన్ని వృథా చేయకుండా జ్ఞాపకాలు కూడబెట్టుకుందాం. కలిసి ముందుకుసాగుదాం’ అని రాసుకొచ్చింది ప్రియాంక.

ఇవి కూడా చదవండి

బీచ్ లో ప్రియాంక జైన్- శివ్ కుమార్..

ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి ప్రపోజల్ నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన బుల్లితెర తారలు, అభిమానులు ప్రియాంక- శివ్ లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా వీరిద్దరు కలిసి మౌనరాగం అనే సీరియల్ లో జంటగా నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..