ఈయన ఆయనే.. ఈ ఫొటోలో కనిపిస్తున్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా.? చాలా ఫేమస్ గురూ..!
సోషల్ మీడియాలో నిత్యం సెలబ్రెటీల ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అభిమానులు నిత్యం సినిమా హీరోయిన్స్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంటారు. ఇక హీరోయిన్స్ కూడా అభిమానులు డిసప్పాయింట్ అవ్వకుండా ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.

సెలబ్రెటీల ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. నెట్టింట సెలబ్రెటీల ఫోటోలు, వీడియోలు రెగ్యులర్ గా వైరల్ అవుతున్నాయి. సినీ తారలు తమ సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు తరచూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ స్టార్ ఫోటో వైరల్ గా మారింది. ఇంతకూ ఆ ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆయన చాలా ఫేమస్.. ఎంతో మంది హీరోలతో కలిసి పని చేశారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పని చేశాడు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? ఆ ఫొటోలో కనిపిస్తుంది మరెవరో కాదు..ఆయన టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్.. ఇప్పటికైనా గుర్తుపట్టారా.?
పై ఫొటోలో కనిపిస్తున్న సెలబ్రెటీ ఎవరో కాదు.. టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పని చేశారు. శేఖర్ మాస్టర్ డాన్స్ మూవ్స్ కు మంచి క్రేజ్ ఉంది. చాలా హుక్ స్టెప్స్ పాపులర్ అయ్యాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేశారు.
సినిమాలతో పాటు పలు టీవీ షోలకు కూడా హాజరవుతున్నారు. అలాగే డాన్స్ షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శేఖర్ మాస్టర్. రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో మధ్యలో ఉన్నది శేఖర్ మాస్టర్. తన స్కూల్ డేస్ లో క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా దిగిన ఫోటో ఇది అని సోషల్ మీడియాలో షేర్ చేశారు శేఖర్ మాస్టర్.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




