నోరు జారాడు.. మహిళా కమిషన్ దెబ్బకు సారీ చెప్పాడు! వీడియో
టాలీవుడ్ సినీయర్ నటుడు శివాజీకి బిగ్ షాక్ తగిలింది. హీరోయిన్ల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కామెంట్స్‌పై వివరణ కోరుతూ శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. శివాజీ మాట్లాడిన మాటలను తెలంగాణ మహిళా కమిషన్ లీగల్ టీమ్ పరిశీలించిందని చైర్‌పర్సన్ నేరెళ్ల శారద వెల్లడించారు. శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
సినీ నటులు మహిళల గురించి మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా సరే మహిళల గురించి అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద వార్నింగ్ ఇచ్చారు. ఆఫర్ట్ బిగ్ బాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన శివాజీ.. దండోరా సినిమా చేశాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మహిళల దుస్తులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన కామెంట్స్ కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఇండస్ట్రీలోని మహిళల్లో ఆయన కామెంట్స్ ను విపరీతంగా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే నటుడు శివాజీ క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. మహిళల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఆ మాటలు అనకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సారీ చెబుతూ ట్విటర్ వేదికగా వీడియోను రిలీజ్ చేశాడు.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
