ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా విషయంలో అసలేం జరుగుతుంది..? ముందు బన్నీతో మైథాలాజికల్ అన్నారు.. మధ్యలో అది ఆగిపోయింది జూనియర్ ఎన్టీఆర్ సడన్‌గా సీన్‌లోకి వచ్చారన్నారు. ఇప్పుడేమో తూచ్ అది కాదు ముందు చెప్పిందే ఫైనల్ అంటున్నారు. అసలేది నిజం.. వెంకటేష్ తర్వాత గురూజీ చేయబోయే సినిమా ఎవరితో ఉండబోతుంది..?
నువ్వు దేనితో మొదలయ్యావో.. అది నీతోనే ఉంటుంది అంటూ అత్తారింటికి దారేదిలో త్రివిక్రమే ఓ డైలాగ్ రాసారు కదా..! ఇప్పుడు ఇదే ఆయనకు అప్లై అయ్యేలా ఉంది. ఎవరి కోసమైతే మైథలాజికల్ కథ గురూజీ రాసారో.. ఆ కథ మళ్లీ తిరిగి తిరిగి అదే హీరో దగ్గరికి వచ్చేలా కనిపిస్తుంది. మనం మాట్లాడేది అల్లు అర్జున్, త్రివిక్రమ్, ఎన్టీఆర్ గురించే..!
గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ కోసం కార్తికేయ స్వామిపై ఓ కథ రాసారు త్రివిక్రమ్. అనౌన్స్‌మెంట్ వీడియో కూడా ఇచ్చారు. అంతలో ఏమైందో ఏమో తెలియదు.. అట్లీ సినిమాతో బిజీ అయ్యారు బన్నీ. ఈ లోపు ఎన్టీఆర్ దగ్గరికి ఈ కథ వచ్చింది. నిర్మాత నాగవంశీ సైతం తారక్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసారు. పైగా కార్తికేయ స్వామి బుక్ కూడా చదివారు ఎన్టీఆర్.అంతా ఓకే.. మైథలాజికల్ సినిమా తారక్‌తో ఫిక్స్ అనుకుంటున్న తరుణంలో మళ్లీ కొత్త వార్తలు వినిపిస్తున్నాయిప్పుడు. అల్లు అర్జున్‌తోనే ఈ ప్రాజెక్ట్ చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు.. ఆ తర్వాత ఉంటే దేవర 2 ఉంటుంది. మరోవైపు అట్లీ సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు.ఎన్టీఆర్ ఖాళీగా లేరు కదా అని.. వెంకటేష్‌తో ఆదర్శ కుటుంబం అనౌన్స్ చేసారు త్రివిక్రమ్. ఇప్పుడేమో.. అట్లీ తర్వాత అల్లు అర్జున్‌తోనే ఆ మైథలాజికల్ సినిమా ఉంటుందంటున్నారు. సంక్రాంతికి అనౌన్స్‌మెంట్ కూడా రాబోతుంది. కేవలం త్రివిక్రమ్ సినిమానే కాదు.. మరో సినిమా కూడా ప్రకటించబోతున్నారు అల్లు అర్జున్.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో