AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య సేవలో... రాజ్ క్యూట్ వీడియో..

భార్య సేవలో… రాజ్ క్యూట్ వీడియో..

Samatha J
|

Updated on: Dec 26, 2025 | 1:34 PM

Share

మొన్న హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌కు జరిగినట్లుగా హైద‌రాబాద్‌లో ఓ షోరూమ్ ఓపెనింగ్ కు వచ్చిన స్టార్‌ హీరోయిన్‌ సమంతకు అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ఓపెనింగ్ తర్వాత సమంత బయటకు వచ్చి తన కారు దగ్గరికి వెళుతుండ‌గా ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఆమెను చూసేందుకు ఎగ‌బ‌డ్డారు. ఆమెను చుట్టుముట్టి సెల్ఫీల కోసం ప్ర‌య‌త్నించారు. దాంతో ఒక్క‌సారిగా పరిస్థితి అదుపు తప్పి, ఆమె కారు వరకు వెళ్లడం కష్టంగా మారింది. తన వ్య‌క్తిగ‌త సెక్యూరిటీ సాయంతో అతిక‌ష్టం మీద అక్క‌డి నుంచి సమంత బ‌య‌ట‌ప‌డ్డారు. అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

డిసెంబర్ ఒకటో తేదీన వివాహ బంధంలోకి అడుగు పెట్టింది సమంత. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సైలెంట్ గా కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో రెండో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత బయట పెద్దగా కనిపించని సమంత, తాజాగా భర్త రాజ్ నిడిమోరు తో మెరిసింది. ముంబై నుంచి వచ్చిన సమంతకు శంషాబాద్‌ విమానాశ్రయంలో వెల్‌కమ్‌ చెప్పారు రాజ్‌. రాజ్ కారు డ్రైవ్ చేస్తుండగా సమంత అతని పక్కన కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన సమంత, నిర్మాతగా కొనసాగుతున్నారు. ట్రాలాలా పతాకంపై సమంత నిర్మాతగా ‘మా ఇంటి బంగారం’ రూపొందుతోంది. ‘ఓ బేబీ’ విజయం తర్వాత నందిని రెడ్డి- సమంత కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథలో సమంత మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించనుంది. మా ఇంటి బంగారంలో తమ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగుంటుందని బాలీవుడ్‌ నటుడు గుల్షన్‌ దేవయ్య కామెంట్‌ చేసారు. సమంత నిర్మాత అయినప్పటికీ సెట్‌లో ఎప్పుడూ నటిగానే వ్యవహరిస్తుందనీ సమంతతో వర్క్‌ చేయడం చాలా ఈజీ అన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో