థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
థియేటర్లకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయా..? కొన్ని రోజులుగా ఆడియన్స్ లేక.. రాక.. ఈగలు తోలుకుంటున్న సింగిల్ స్క్రీన్స్‌కు పునర్వైభవం కోసం రెండు తెలుగు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయా..? టికెట్ రేట్లపై చర్చ మళ్లీ మొదలైందా..? దీనిపై నిర్మాతలు ఏమంటున్నారు..? ఓటిటి ఎందుకు స్లో డౌన్ అయింది..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..?
థియేటర్లకు మంచి రోజులు పోయి చాలా రోజులైపోయింది. ఒకప్పుడు లాంగ్ రన్ ఉండేది కాబట్టి సింగిల్ స్క్రీన్స్ కళకళలాడాయి. కానీ ఇప్పుడలా కాదు.. లాంగ్ రన్ లేక, పైరసీ వచ్చేసి థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. దాంతో పునర్వైభవం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు నిర్మాతలు. వాళ్లకు సహకరిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు.
సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ఏపీలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో ఏపీ ఉన్నతాధికారులతో మీటింగ్ జరిగింది. దీనికి ఇండస్ట్రీ నుంచి కొందరు దర్శక నిర్మాతలు హాజరయ్యారు. అందులో దుర్గేష్ మాట్లాడుతూ టికెట్ రేట్లతో పాటు.. క్యాంటీన్ రేట్లపై కూడా సమీక్షిస్తున్నామన్నారు. మరోవైపు బన్నీ వాస్, వంశీ నందిపాటి కూడా టికెట్ రేట్లు, ఓటిటిపై చాలా క్లియర్‌గా ఉన్నారు.కరోనా తర్వాత థియేటర్లకు దూరం అయ్యారు ఆడియన్స్. కానీ ఇప్పుడు ఓటిటి కూడా చాలా సెలెక్టివ్ అయిపోయిందని.. నెక్ట్స్ మూడేళ్లు మళ్లీ టీవీలు బోర్ కొట్టి థియేటర్స్ వైపు రావడానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు నిర్మాత దామోదర ప్రసాద్. దాన్ని క్యాష్ చేసుకోడానికే టికెట్ రేట్లు ముఖ్యమన్నారాయన. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీయాలి.. థియేటర్లకు ఫుట్ ఫాల్స్ పెంచేలా ప్లాన్ చేసుకోవాలనేది నిర్మాతల ప్లాన్. మరోవైపు ప్రతీ సినమాకు రేట్లు పెంచడమనే కాన్సెప్ట్ లేకుండా స్లాబ్ సిస్టమ్ తీసుకురావాలనేది సర్కార్ ప్లాన్. కాకపోతే 99 రూపాయల రేట్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా అర్థం చేసుకోవాలి. అలా జరిగినపుడే థియేటర్లకు మళ్లీ మంచి రోజులు వచ్చేది. చూడాలిక.. ఏం జరగబోతుందో..?
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

