మీ అకౌంట్లో ఇన్ని లక్షలు ఎక్కడివి? CID ఝలక్ వీడియో
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీల పాత్రపై దృష్టి సారించిన CID అధికారులు, తాజాగా కీలక విచారణను పూర్తి చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారనే ఆరోపణలతో టీవీ నటి రీతూ చౌదరి, సోషల్ మీడియా సెలబ్రిటీ భయ్యా సన్నీ యాదవ్‌లను సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు.
దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ విచారణలో వీరిద్దరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. యాప్స్ నిర్వాహకులతో వీరికి ఉన్న ఒప్పందాలు, ప్రమోషన్ల కోసం తీసుకున్న పారితోషికం వంటి అంశాలపై అధికారులు ఆరా తీశారు. కేవలం వీరిద్దరే కాకుండా, ఈ కేసులో మొత్తం 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రమోషన్ల ద్వారా లక్షలాది రూపాయలు వీరి ఖాతాల్లోకి చేరినట్లు సీఐడీ గుర్తించింది. సెలబ్రిటీలు ఇచ్చిన వివరాలను వారి బ్యాంక్ లావాదేవీలతో సరిపోల్చి చూస్తున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది? విదేశీ లింకులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ తనిఖీలు సాగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

