Health Tips: చిన్న లోపమేగా అనుకుంటారు.. కానీ డేంజర్.. ఈ లక్షణాలు కనిపిస్తే లైట్ తీసుకోవద్దు..
మన శరీరం, అవయవాలు ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే విటమిన్లు, ఖనిజాలు అవసరం.. శరీరానికి పోషకాలు సరిగా అందకపోతే.. శరీర విధులకు ఆటంకం కలుగుతుంది.. అలాగే.. అవయవాలు సక్రమంగా పనిచేయవు.. విటమిన్లు, ఖనిజాలతో కూడిన పోషకాల సమతుల్య ఆహారం శరీర అభివృద్ధికి, వ్యాధి నిరోధక శక్తికి, జీవక్రియలకు సహాయపడతాయి.

మన శరీరం, అవయవాలు ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే విటమిన్లు, ఖనిజాలు అవసరం.. శరీరానికి పోషకాలు సరిగా అందకపోతే.. శరీర విధులకు ఆటంకం కలుగుతుంది.. అలాగే.. అవయవాలు సక్రమంగా పనిచేయవు.. విటమిన్లు, ఖనిజాలతో కూడిన పోషకాల సమతుల్య ఆహారం శరీర అభివృద్ధికి, వ్యాధి నిరోధక శక్తికి, జీవక్రియలకు సహాయపడతాయి. అయితే.. అలాంటి ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ B12 ఒకటి.. ఎర్ర రక్త కణాలు, నరాల ఆరోగ్యం DNA ఏర్పడటానికి ఈ విటమిన్ బి12.. మన శరీరంలో ఒక ముఖ్యమైన పోషకం. చాలా మంది పట్టించుకోరు కానీ.. ఇది శరీరానికి చాలా అవసరం. ఈ బి12 విటమిన్ లోపించినపుడు.. అది శారీరక, నాడీ సంబంధిత మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఇది లోపించినపుడు, మన శరీరంలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి..
విటమిన్ బి12 లోపం ఉంటే కనిపించే లక్షణాలు..
చేతులు, కాళ్ళలో జలదరింపు: విటమిన్ బి12 లోపం నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ప్రారంభ లక్షణాలలో ఒకటి చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు.. ఇవి కనిపిస్తే అలర్టవ్వాలి..
నిరంతర అలసట: విటమిన్ బి12 లోపం తీవ్రమైన అలసటకు కారణమవుతుంది. ఈ విటమిన్ లోపం శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా నిరోధిస్తుంది. ఇది కండరాల బలహీనతకు, నిరంతర అలసట భావనకు దారితీస్తుంది.
శ్వాస ఆడకపోవడం: ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు విటమిన్ బి12 చాలా అవసరం. అందువల్ల, దీని లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఇది ఆక్సిజన్ ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది.. ఇది శ్వాస ఆడకపోవడానికి దారితీస్తుంది.
చర్మం పాలిపోవడం: విటమిన్ బి12 లోపం వల్ల చర్మం పాలిపోవడం జరుగుతుంది. శరీరం తగినంత ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల ఇది రక్తహీనతకు దారితీస్తుంది.
నాడీ సంబంధిత సమస్యలు: విటమిన్ B12 లోపం వల్ల.. జ్ఞాపకశక్తి సమస్యలు, నాడీ సంబంధిత సమస్యలతోపాటు.. జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి లక్షణాలను గమనిస్తే.. ఆహారంలో మార్పులతోపాటు.. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
