చలికాలంలో ఆస్తమా బాధితులు పాటించాల్సిన టిప్స్ ఇవే!

Samatha

24 December 2025

చలికాలంలో ఆస్తమా పేషెంట్స్ అనేక సమస్యలు ఎదుర్కుంటారు. చల్లటి గాలులు, పొగ మంచు కారణంగా వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు.

అందుకే చలికాలంలో ఆస్తమా పేషెంట్స్ ఆరోగ్యం విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

చలికాలంలో చల్లటి గాలి శ్వాసనాళాల్లోకి వెళ్లి తేమను తగ్గించి, మంటను కలిగిస్తుంది. దీని వలన దగ్గు, ఆయాసం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.

అందువలన ఆస్తమా పేషెంట్స్ వీలైనంత వరకు బయటకు వెళ్లినప్పుడు, ముక్కు,నోరు కవర్ చేసుకోవడం మంచిది.

అదే విధంగా ఇంటిలోపలికి గాలి, మంచి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. రోజూ గోరు వెచ్చటి నీరు తాగడం చాలా మంచిది.

మరీ ముఖ్యంగా మీకు జలుబు లాంటి సమస్యలు వచ్చినప్పుడు, త్వరగా ఆవిరి పట్టడం బెస్ట్ దీని వలన శ్వాసనాళాల్లో పేరుకుపోయిన డస్ట్ పోతుంది.

అదే విధంగా చెవులలోకి గాలి వెళ్లకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 6 తర్వాత బయట తిరగక పోవడమే మంచిది.

అలాగే డాక్టర్ సూచించిన ఇన్ హేలర్లూ, నెబ్యులైజర్స్ వంటివి వాడుతూ ఉండటం, అవి మీకు అందుబాటులో ఉంచుకోవడం మంచిది.