AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాకింగ్ ఇలా చేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది..! ఈజీగా స్లిమ్‌ అయిపోతారు..

పొట్ట తగ్గడం కోసం చేసే సాధారణ వాకింగ్ ఆశించిన ఫలితాలను ఇవ్వదు. కేలరీలు అధికంగా ఖర్చు కావాలంటే కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. వేగంగా, నెమ్మదిగా నడవడం, ఎత్తైన ప్రదేశాల్లో వాకింగ్, బరువులు మోస్తూ నడవడం, సరైన శరీర భంగిమ, మెట్లు ఎక్కడం వంటివి చేస్తే పొట్ట కొవ్వు సులువుగా కరిగి, బరువు అదుపులో ఉంటుంది. ఈ చిట్కాలతో వాకింగ్ మరింత ప్రభావవంతంగా మారుతుంది.

వాకింగ్ ఇలా చేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది..! ఈజీగా స్లిమ్‌ అయిపోతారు..
Walking
Jyothi Gadda
|

Updated on: Dec 26, 2025 | 2:11 PM

Share

సరిగా చేస్తేచాలామంది పొట్ట తగ్గడం కోసం, బరువు అదుపులో ఉండటం కోసం రోజూ వాకింగ్ చేస్తుంటారు. ఇలా ఎన్ని రోజులు చేసినా ఫలితం మాత్రం ఉండదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మెల్లగా, వేగంగావాకింగ్‌ను ఒకే వేగంతో చేయడం వల్ల కేలరీల ఖర్చు సరిగా జరగదు. దీంతో పొట్ట తగ్గడం చాలా ఆలస్యమవుతుంది. అయితే వాకింగ్‌ను సరైన పద్ధతిలో చేస్తే పొట్టను ఈజీగా తగ్గించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

మెల్లగా, వేగంగావాకింగ్‌ను ఒకే వేగంతో చేయడం వల్ల కేలరీల ఖర్చు సరిగా జరగదు. దీంతో పొట్ట తగ్గడం చాలా ఆలస్యమవుతుంది. అందుకే రెండు నిమిషాలు నెమ్మదిగా నడిచి, నిమిషం పాటు వేగంగా నడవండి. ఇలా పది నిమిషాలు చేయండి. తర్వాత 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల కేలరీలు బాగా ఖర్చవుతాయి. పొట్ట సులువుగా కరిగిపోతుంది.

ఎత్తైన ప్రదేశాలు లేదా కొండలు ఎక్కడం ద్వారా వాకింగ్ కంటే ఎక్కువ కేలరీల ఖర్చు చేయవచ్చు. అందుకే వాకింగ్‌ను కాస్త ఎత్తైన ప్రదేశంలో చేయండి. వారంలో కనీసం 3 రోజులు హైకింగ్‌ చేస్తే కేలరీల ఖర్చు పెరిగి పొట్ట తొందరగా తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతారు. నార్మల్‌గా నడవటం వల్ల ఖర్చయ్యే కేలరీల కంటే బరువులు ఎత్తి నడిస్తే కేలరీలు మరింత ఎక్కువగా ఖర్చవుతాయి. అందుకే ముందుగా కాసేపు వాకింగ్ చేశాక 2-3 కేజీల బరువును బ్యాక్ ప్యాక్‌లో ఉంచి 10 నిమిషాలు వాకింగ్ చేయండి. బ్రేక్ తీసుకుని 30-40 నిమిషాలు ఇలా చేస్తే పొట్ట సులువుగా కరిగిపోతుంది. బరువు తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

అయితే మీ శరీర సామర్థ్యానికి తగిన బరువులు ఎంచుకోవడం ముఖ్యం. వాకింగ్ చేసేటపుడు మీ శరీర భంగిమ సరిగా ఉండటం చాలా అవసరం. నిటారుగా నిల్చుని, భుజాలను స్ట్రెయిట్‌గా ఉంచి నడవండి. అలాగే నడిచేటపుడు మీ పాదాలు మడిమతో సహా పూర్తిగా నేలను తాకేలా చూసుకోండి. దీనివల్ల కేలరీల ఖర్చు పెరిగి పొట్ట తగ్గించుకోవచ్చు. వాకింగ్‌లో ట్విస్టింగ్ ఉంటే మరీ మంచిది. దీనికోసం 5 నిమిషాలు వార్మప్ చేసి కాసేపు నార్మల్ వాకింగ్ చేయండి. తర్వాత ఒక్కో అడుగుకు ఒక్కో వైపు (కుడి, ఎడమవైపు) మీ అప్పర్ బాడీని వంచుతూ నడవండి. ఇలా 15 నిమిషాలు చేసి మరో 10 నిమిషాలు నార్మల్ వాకింగ్ చేయండి. తర్వాత బ్రేక్ తీసుకుంటే కేలరీల ఖర్చు పెరుగుతుంది. పొట్ట తగ్గుతుంది.

వాకింగ్‌తో పాటు మధ్య మధ్యలో కొన్ని వేరే ఎక్సర్‌సైజ్‌లు చేయడం మంచిది. బ్రేక్ సమయంలో కాసేపు గుంజీలు తీయడం, లాంజెస్, బర్పీస్, పుష్ అప్స్ వంటివి తీయడం ద్వారా కేలరీల ఖర్చు మరింత పెరుగుతుంది. పొట్ట తగ్గి బరువు అదుపులో ఉంటుంది. వాకింగ్ సమయంలో నేలపైనే కాకుండా మెట్లు ఎక్కడంపై కూడా ఫోకస్ చేయండి. దీనివల్ల కండరాలు బలపడటమే కాకుండా కేలరీల ఖర్చు పెరుగుతుంది. పొట్టను సులువుగా కరిగించుకోవచ్చు. కనీసం 5-10 నిమిషాలు మెట్లు ఎక్కితే మేలు. మొదటి వారంలో చేసిన వాకింగ్ దూరం కంటే రెండో వారంలో కాస్త దూరం పెంచండి. రోజుకు 7 వేల అడుగులతో మొదలు పెట్టి 13వేల అడుగుల వరకు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. తద్వారా కేలరీల ఖర్చు పెరుగుతుంది. పొట్ట తగ్గుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?