AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?

ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమాలో ఆడిపాడుతోందీ అందాల తార. బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ మెగా మూవీలో జాన్వీ ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించనుంది.

Janhvi Kapoor: మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?
Bollywood Actress Janhvi Kapoor
Basha Shek
|

Updated on: Dec 26, 2025 | 1:55 PM

Share

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి హిందువులపై ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఇటీవల 27 ఏళ్ల దీపు చంద్ర దాస్‌ అనే హిందూ యువకుడిని కొందరు దారుణంగా హత్య చేశారు. అంతేకాదు బంగ్లాదేశ్ లోని భారత రాయబార కార్యాలయంపై కూడా రాళ్లు రువ్వుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతోన్న దారుణాలపై భారతదేశంలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల వీహెచ్ పీ నాయకులు, హిందూ సోదరులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను కాపాడాలని కోరుతున్నారు . ఈక్రమంలో సినీ ప్రముఖులు కూడా బంగ్లాదేశ్ ఉదంతంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్ దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా, తాజాగా బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ఈ విషయంపై స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘దీపు చంద్ర దాస్’ అనే టైటిల్‌తో ఒక నోట్ రాసుకొచ్చింది జాన్వీ,

‘బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది అనాగరికం. ఇది కేవలం ఒక సంఘటన కాదు.. ఇదొక మారణకాండ. ఒక హిందువును నడిరోడ్డుపై అత్యంత దారుణంగా చంపి తగలబెట్టారు. ఆ వీడియోలు చూసి, ఆ వార్తలు చదివి, ప్రశ్నలు అడిగాక కూడా.. మీకు ఆవేశం రాకపోతే.. మనలోని ఆ ద్వంద్వ వైఖరే మనకు తెలియకుండానే మనల్ని సర్వ నాశనం చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాల పట్ల మనం స్పందిస్తాం.. బాధపడతాం.. ఏడుస్తాం. కానీ మన పక్కనే మన సోదరసోదరీమణులను సజీవ దహనం చేస్తుంటే పట్టించుకోమా? మనం మన మానవత్వాన్ని మర్చిపోకముందే.. ఏ రూపంలో ఉన్నా సరే అతివాదాన్ని గట్టిగా ఖండించాల్సిందే’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది జాన్వీ

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం జాన్వీ కపూర్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు ఆమెకు సపోర్టుగా కామెంట్స్ పెడుతున్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతోన్న ఆకృత్యాలకు అడ్డు కట్ట పడేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. #savebangladeshihindus హ్యాష్ ట్యాగ్ పేరుతో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.