AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Babu: ‘షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..’

దర్శకుడు రవిబాబు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కున్న సవాళ్ల గురించి మాట్లాడాడు. అనసూయ చిత్రంలో పాత్ర కోసం గుండు చేయించుకొని, కనుబొమ్మలు తీసేసిన తర్వాత, హీరోయిన్‌ భూమిక 14 రోజుల పాటు షూటింగ్‌కు రాలేదని తెలిపాడు. దీనివల్ల తాను గుండుతో బయట తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడినట్లు వివరించాడు.

Ravi Babu: 'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
Director Ravi Babu
Ravi Kiran
|

Updated on: Dec 26, 2025 | 2:10 PM

Share

విలక్షణ నటనకు, వెర్సటైల్ స్టోరి టెల్లింగ్‌కు దర్శకుడు రవిబాబు పెట్టింది పేరు. సీనియర్ నటుడు చలపతిరావు కోడుకైనప్పటికీ.. ఇండస్ట్రీలో అటు నటుడిగా.. ఇటు దర్శకుడిగా నిలదొక్కుకునే క్రమంలో రవిబాబు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విషయాలు అతడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. తన సినీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశానని.. అలాగే తాను నటిస్తూ, దర్శకత్వం వహించిన ఓ సినిమా కోసం కష్టాలు పడాల్సి వచ్చిందని రవిబాబు అన్నాడు. అనసూయ చిత్రం షూటింగ్‌ సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ చిత్రంలో తన పాత్ర డిమాండ్‌ మేరకు రవిబాబు జుట్టు, ఫ్రెంచ్ బియర్డ్‌తో ఉన్న పాత్ర నుంచి గుండుతో, కనుబొమ్మలు తీసేసి నటించాల్సి ఉంది. ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ సీన్ కోసం ఒక అద్దంలో ప్రతిబింబాన్ని చూపించి, ఆ వెంటనే గుండు, కనుబొమ్మలు లేని తన రూపాన్ని తెరపై చూపించే షాట్‌ను చిత్రీకరించారు.

ఈ కీలకమైన సన్నివేశం కోసం రవిబాబు తన జుట్టును పూర్తిగా తీయించుకొని, కనుబొమ్మలను కూడా తొలగించుకున్నాడు. ఆ రోజు హీరోయిన్ భూమికతో కలిసి షూటింగ్‌ చేస్తున్నప్పుడు.. మధ్యాహ్నం ఆమె.. ‘ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్’ అని చెప్పి వెళ్లిపోయిందని రవిబాబు తెలిపాడు. ఆమె అనారోగ్యంతో ఉన్నందున రవిబాబు ఇవాళ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి.. నెక్స్ట్ డే చేసుకుందామని అనుకున్నాడు. అయితే మరుసటి రోజు హీరోయిన్ భూమిక ఫోన్ చేసి తాను ముంబై వెళ్లాల్సి ఉందని.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వస్తానని చెప్పినట్టుగా రవిబాబు వివరించాడు.

అనూహ్యంగా హీరోయిన్ భూమిక 14 రోజుల పాటు షూటింగ్‌కు తిరిగి రాలేదు. సరిగ్గా తాను గుండు కొట్టించుకుని, కనుబొమ్మలు తీయించుకున్న సమయం అది. ఈ 14 రోజుల ఆమె లేకపోవడం వల్ల రవిబాబు తీవ్ర ఇబ్బందులు పడ్డాడట. బయటకు వెళ్ళాల్సిన వచ్చినప్పుడు.. ప్రతీసారి పెద్ద కళ్లజోడు, టోపీ పెట్టుకునేవాడినని చెప్పాడు. ఒకరోజు ముందుగా ఈ సంఘటన జరిగి ఉన్నా.. బాగుండేదని.. ఆ 14 రోజులు తాను ఇబ్బందిపడేవాడిని కాదని రవిబాబు గుర్తు చేసుకున్నాడు. ఈ ఘటన వల్ల తాను డిప్రెషన్‌కు లోనవ్వలేదని.. కేవలం అసౌకర్యాన్ని ఫీల్ అయినట్టు చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'