Hair Growth: జుట్టు రాలుతోందని తెగ ఫీలవుతున్నారా? ఈ నూనెతో మసాజ్ చేసుకున్నారంటే మ్యాజిక్
ఆవ నూనెను భారతదేశంతో పాటు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఈ ఆవ నూనెను విస్తృతంగా ఉపయోగిస్తారు. యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరప్‌లలో వంటలో స్వచ్ఛమైన ఆవ నూనె వాడటం పూర్తిగా నిషేధించబడింది. కానీ, ఈ ప్రాంతాలలో దీనిని మసాజ్ ఆయిల్, సీరం లేదా జుట్టు చికిత్స కోసం మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే.. ఆవ నూనెతో తలకు మసాజ్ చేయటం బోలెడన్నీ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఆవాల గింజల నుండి తయారయ్యే ఆవ నూనెను భారతదేశంలో చాలా మంది వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. దాని బలమైన రుచి, ఘాటైన వాసన, అధిక పొగ కారణంగా కొందరు దీన్ని అసలు ముట్టుకోరు. కానీ, భారతదేశంతో పాటు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఈ ఆవ నూనెను విస్తృతంగా ఉపయోగిస్తారు. యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరప్‌లలో వంటలో స్వచ్ఛమైన ఆవ నూనె వాడటం పూర్తిగా నిషేధించబడింది. కానీ, ఈ ప్రాంతాలలో దీనిని మసాజ్ ఆయిల్, సీరం లేదా జుట్టు చికిత్స కోసం మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే.. ఆవ నూనెతో తలకు మసాజ్ చేయటం బోలెడన్నీ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. అధిక ఒత్తిడి, పొల్యూషన్, పోషకాహారం తగ్గిపోవడం, జంక్ పుడ్ ఎక్కువగా తినడం, నిద్రలేమి వల్ల ఎక్కువగా జుట్టు రాలుతుంది. జుట్టు పెరిగే సమస్య కూడా ఎక్కువగా ఉంటోంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది కూడా. కానీ, జుట్టు సంరక్షణ కోసం ఆవనూనె ఉపయోగించటం వల్ల ఈ సమస్యలన్నంటికీ చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. జుట్టు రాలడం దగ్గర్నుంచీ తెల్ల జుట్టుని నల్లగా మార్చేవరకూ అనేక రకాలుగా ఆవనూనె ఉపయోగపడుతుంది.
ఆవ నూనెలో కరివేపాకు వేసి వేడి చేసి తలకు రాసుకుంటే సహజంగా జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. కరివేపాకులో విటమిన్ B, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అకాలంలో జుట్టు తెల్లబడకుండా కాపాడతాయి. అలాగే, ఉల్లిపాయ రసాన్ని ఆవ నూనెతో కలిపి కూడా మసాజ్ చేస్తే, కొత్త జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త జుట్టు పెరగడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆవ నూనె చర్మానికి కూడా మంచిది. ఇందులో విటమిన్ ఇ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది. శీతాకాలంలో చర్మం పొడిబారకుండా చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




