AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?

ఇటీవల కాలంలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే, డయాబెటిస్ లక్షణాలు తెలియపోవడంతో ఎక్కువ మంది చాలా ఆలస్యంగా తమకు మధుమేహం ఉందని తెలుసుకుంటున్నారు. మూత్రంలో మంట అనేది కూడా మధుమేహానికి ఒక లక్షణమని వైద్యులు చెబుతున్నారు. తరచూ మూత్రంలో మంట ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Diabetes: మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
Diabetes
Rajashekher G
|

Updated on: Dec 26, 2025 | 2:22 PM

Share

మూత్రంలో మంట అనేది చాలా మంది సాధారణ సమస్యగానే చూస్తున్నారు. అయితే, తరచుగా ఈ సమస్య అలాగే ఉంటే మాత్రం వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి. ఎందుకంటే.. ఇది ప్రస్తుతం కాలంలో ఉన్న తీవ్రమైన వ్యాధులలో ఒకటైన డయాబెటిస్(మధుమేహం)కు కారణంగా కూడా కావచ్చు. తీసుకునే ఆహారం, జీవనశైలి కారణంగా వృద్ధులే కాకుండా యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

మూత్రంలో మంట అనేది డయాబెటిస్‌కి ప్రారంభ సంకేతం కావచ్చా? అనేదానిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఆర్ఎంఎల్ ఆస్పత్రిలోని మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ సుభాష్ గిరి ఈ విషయంపై స్పష్టంగా వివరించారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం ప్రతిసారీ మధుమేహానికి సంకేతం కాదన్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది మధుమేహం లేదా సంబంధిత పరిస్థితికి సంకేతం కావచ్చన్నారు.

మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర పెరగడం వల్ల శరీరం ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. తరచూ మూత్రానికి వెళ్లడం వల్ల శరీరం నిర్జలీకరణానికి కారణమవుతుంది. దీంతో మూత్రం మరింత గాఢంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఇది కొన్నిసార్లు మంట లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే, మూత్రం మండటానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇన్ఫెక్షన్ లేదా తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల కూడా మూత్రం మంట గా రావచ్చు. అయితే, మూత్రం మండడం ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం రక్తంలో చక్కెర పరీక్ష తప్పనిసరిగా చేసుకోవాలి. సకాలంలో టెస్ట్ చేయడం వల్ల పరిస్థితిని నియంత్రించడం సులభమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

డయాబెటిస్ ఇతర లక్షణాలు

మధుమేహం(diabetes) లక్షణాలు సాధారణంగా అనిపించడంతో చాలా మంది నిర్లక్ష్యంగా చేస్తుంటారు. అలసట, తరచుగా దాహం వేయడం, తరచుగా మూత్రవిసర్జన చేయడం, ఆకస్మిక బరువు తగ్గడం, పెరగడం మధుమేహానికి సాధారణ సంకేతాలు. ఇంకా, నిరంతర అలసట, ఆలస్యంగా గాయం మానడం, దృష్టి మసకబారడం, ఆకలి పెరగడం కూడా మధుమేహ లక్షణాలు కావచ్చు. ఇక, కొంతమందిలో చేతులు, కాళ్లలో జలదరింపు లేదా తిమ్మిరి కూడా అనిపిస్తుంది. ఈ లక్షణాలు కొనసాగితే సకాలంలో వ్యాధి నిర్ధారణ, చికిత్స ప్రారంభించేందుకు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

మధుమేహం దరిచేరకుండా ఉండాలంటే పలు ఆహార, శరీరక నియామాలు పాటించాలి. సమతుల, పోషక ఆహారం తీసుకోవడం ప్రతి రోజూ తేలికపాటి వ్యాయామం లేదా నడక కొనసాగించడం శరీర బరువును అదుపులో ఉంచుకోవడం తీపి, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం తగినంత ఎక్కువ నీరు తాగడం మీ రక్తంలోచక్కెరను క్రమం తప్పకుండా టెస్ట్ చేయించుకోవడం ఒత్తిడిని తగ్గించుకోవడంతోపాటు తగినంత నిద్రపోవాలి.

మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే