కొరటాల లిస్టులో చేరిన ఆ సీనియర్ హీరో వీడియో
దేవర 2 పరిస్థితి ఏంటి..? సినిమా ఉంటుందా లేదా..? కచ్చితంగా ఉంటుందనే మేకర్స్ చెప్తున్నారు కానీ అనుమానాలు కూడా అలాగే ఉన్నాయి. ఒకవేళ దేవర 2 ఆగిపోతే.. కొరటాల నెక్ట్స్ స్టెప్ ఏంటి..? ఆయన ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు..? అసలు కొరటాల లిస్టులో ఉన్న హీరోలెవరు..? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి..?
500 కోట్ల సినిమా ఇచ్చిన తర్వాత కూడా కొరటాల శివకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇంకా డైలమాలో ఉంది. ఓ వైపు దేవర 2 ఉందని కచ్చితంగా చెప్తున్నారు మేకర్స్. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవర 2 వైపు వస్తారనేది వాళ్ల నమ్మకం. కానీ అది జరుగుతుందా అనేది చూడాలి.
దేవర విజయం సాధించినా.. కేవలం తారక్ స్టామినాతో ఆడింది.. దసరా సీజన్ కలిసొచ్చిందనే విమర్శలు కూడా బాగానే వచ్చాయి. అందుకే పార్ట్ 2 కోసం ఏడాదిన్నరగా కష్టపడుతున్నారు కొరటాల. కానీ దేవర 2 ఉందో లేదో తెలియని ఈ క్రమంలోనే.. ఆయన చూపులు బాలయ్య వైపు వెళ్తున్నాయని తెలుస్తుంది. అన్నీ కుదిర్తే ఈ కాంబో కుదిరేలాగే కనిపిస్తుంది.బాలయ్య త్వరలోనే గోపీచంద్ మలినేనితో పీరియడ్ డ్రామా చేయబోతున్నారు. దీని తర్వాత కొరటాల సినిమా ఉండే అవకాశాలున్నాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేనులో కమర్షియల్ అంశాలు చెప్తూ.. మెసేజ్ ఇచ్చారు కొరటాల. దేవరతో రూట్ మార్చినా.. బాలయ్యతో మళ్లీ తన ఓల్డ్ స్కూల్‌కు వెళ్లాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. చూడాలిక.. ఏం జరగబోతుందో..?
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
