AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సల్మాన్.. బిగ్ బాస్ షో కోసం ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?

బిగ్ బాస్ సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. తెలుగు, హిందీ తదితర భాషల్లో బిగ్ బాస్ రియాలిటీ షో కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా హిందీలో కూడా సల్మాన్ ఖాన్ ఈ షోను హోస్ట్ చేయనున్నారు. కానీ ఈసారి మాత్రం భారీ మొత్తంలో పారితోషికం అందుకోనున్నాడు సల్లూ భాయ్.

Salman Khan: రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సల్మాన్.. బిగ్ బాస్ షో కోసం ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?
Salman Khan
Basha Shek
|

Updated on: Jun 08, 2025 | 4:30 PM

Share

బుల్లితెర ఆడియెన్స్ ను అమితంగా అలరించే టీవీ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రతి సీజన్‌లోనూ ఈ షో కొత్తగా కనిపిస్తుంది. కొత్త థీమ్ తో ఆడియెన్స్ ను అలరిస్తారు. అలాగే కంటెస్టెంట్స్ ఎంపికలో కూడా వైవిధ్యం ప్రదర్శిస్తారు. అయితే ఒక కన్నడ భాషలో తప్పితే ఏ భాషలోనూ బిగ్ బాస్ హోస్టులు మారడం లేదు. హిందీలోనూ అదే పరిస్థితి. సల్మాన్ గత కొన్ని సంవత్సరాలుగా బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్నారు. అలాగే తన రెమ్యునరేషన్ లను కూడా బాగా పెంచుకుంటూ పోతున్నాడు. సాధారణంగా మూడు నెలల పాటు కొనసాగే ఈ షో 19వ సీజన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది. దీని కోసం సల్మాన్ ఖాన్ ఈ నెలాఖరు నాటికి ప్రోమో షూటింగ్ ప్రారంభించనున్నారు. ప్రతి సీజన్‌లో, ఈ సీజన్‌లో ఏ పోటీదారులు పాల్గొంటారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది? కానీ దానితో పాటు, అభిమానులు ఎల్లప్పుడూ మరో విషయం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటారు. అదే సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్

‘బిగ్ బాస్’ పద్దెనిమిదవ సీజన్ కోసం దాదాపు రూ. 250 కోట్లు అందుకున్నాడు సల్మాన్. అయితే ఈ సారి బిగ్ బాస్ షో రన్నింగ్ టైమ్ పెరగడంతో తన రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు. ‘బిగ్ బాస్’ 19వ సీజన్ కోసం సల్మాన్ దాదాపు రూ. 300 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ కోసం ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు నెలలు షూటింగ్ లో పాల్గొంటాడు లస్మాన్. కానీ ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు సల్మాన్ నుండి మరిన్ని ఎక్కువ రోజుల డేట్స్ అడుగుతున్నారు. అందుకే ఈ కండల వీరుడు తన పారితోషికాన్ని కూడా భారీగా పెంచినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్..

బిగ్ బాస్ హిందీ కొత్త సీజన్ జూలై చివరలో లేదా ఆగస్టు ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అపూర్వ ముఖిజా, గౌతమి కపూర్, మూన్ బెనర్జీ, అరిష్ఫా ఖాన్, డైసీ షా, ఖుషీ దుబే, మూన్మున్ దత్తా, మిస్టర్ ఫైజు వంటి సెలబ్రిటీలు ఈ సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఉండనున్నారని సమాచారం. గత బిగ్ బాస్ సీజన్ లో టెలివిజన్ నటుడు కరణ్‌వీర్ మెహ్రా ‘బిగ్ బాస్ 18’ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా